Fake News, Telugu
 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంబేద్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్నాడని మార్ఫ్ చేసిన ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు

0

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంబేద్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్నాడని ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంబేద్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్న ఫోటో.

ఫాక్ట్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంబేద్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్న ఈ ఫోటోను మార్ఫ్ చేసారు, అది అసలైన ఫోటో కాదు. కిమ్ జోంగ్ ఉన్, జున్సే తెరసవని అనే సాధువును కలిసినప్పుడు ఆయనకు నమస్కరిస్తున్నప్పుడు తీసిన ఫోటోను మార్ఫ్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని జత చేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.     

కేవలం కిమ్ జోంగ్ ఉన్ నమస్కరిస్తున్న భాగాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విధంగా ఉన్న ఫోటో ఒకటి ఫేస్‌బుక్‌ పోస్టులో లభించింది. కానీ, ఆ ఫోటోలో అంబేద్కర్ విగ్రహం లేదు, మరియు కిమ్ జోంగ్ ఉన్ యొక్క ఫోటో రొటేట్ చేయబడి ఉంది. ఆ ఫేస్‌బుక్‌ పోస్టులో కిమ్ జోంగ్ ఉన్ జున్సే తెరసవని అనే సాధువును కలిసినప్పుడు ఆయనకు నమస్కరిస్తున్నప్పుడు తీసిందని తెలిపారు.

మరిన్ని కీ-వర్డ్స్ తో ఆన్‌లైన్‌లో వెతకగా, ఇంటర్ రిలీజియస్ ఫెడరేషన్ ఫర్ వరల్డ్ పీస్ వెబ్సైటులో అదే ఫోటోతో పాటు కిమ్ జోంగ్ ఉన్ ఆయన్ను కలిసిన కొన్ని ఫోటోలు లభించాయి.

కిమ్ జోంగ్ ఉన్, జున్సే తెరసవని అనే సాధువును కలిసి తర్వాత ఆయనకు నమస్కరిస్తున్నప్పుడు తీసిన ఫోటోను, మరియు వైరల్ ఫోటోను పోల్చిచూడగా అంబేద్కర్ విగ్రహాన్ని మార్ఫ్ చేసి అందులో ఎడిట్ చేసినట్టు తెలుస్తుంది. రెండు ఫోటోల బ్యాక్ గ్రౌండ్ ఒకే రకంగా ఉన్నట్టు చూడొచ్చు.

చివరగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంబేద్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్నాడని మార్ఫ్ చేసిన ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll