‘జగన్ అన్న ఫోటో గోశాలలో పెట్టడం ద్వారా గేదలు సంతోషంతో ఎక్కువ పాలు ఇస్తున్నాయి’, అని సాక్షి వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో పెట్టడం వలన గేదెలు పాలు ఇస్తున్నాయని సాక్షి వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ యొక్క ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. 2015లో ఈ ఫోటోని మొట్టమొద్దట ‘జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ UK’ సంస్థ తమ వెబ్సైటులో పబ్లిష్ చేసింది. అసలు ఫోటోలో కనిపిస్తున్న గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో ఎక్కడా అతికించి లేదు. గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో పెట్టడం వలన గేదెలు పాలు ఇస్తున్నాయని సాక్షి వార్తా సంస్థ ఎటువంటి ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు సాక్షి వార్తా సంస్థ ఈ విధమైన ఆర్టికల్ ఏమైన పబ్లిష్ చేసిందా అని వెతికితే, ఇలాంటి ఆర్టికల్ ఏది సాక్షి వార్తా సంస్థ పబ్లిష్ చేయలేదని తెలిసింది. సాక్షి వెబ్సైటులో గోశాలలకు సంబంధించి పబ్లిష్ అయిన ఆర్టికల్స్‌ని ఇక్కడ చూడవచ్చు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోని మొట్టమొదట ‘జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ UK’ సంస్థ 2015లో తమ వెబ్సైటులో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ అసలు ఫోటోలో కనిపిస్తున్న గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో ఎక్కడా అతికించి లేదు. ఈ ఫోటోని పలు కన్నడ వార్తా సంస్థలు తమ ఆర్టికల్స్‌లో రిఫరెన్స్ చిత్రంగా పబ్లిష్ చేసినట్టు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం వద్ద నూతనంగా ఒక గోశాలను ఏర్పాటు చేసారు. ఈ గోశాలను వై.ఎస్.జగన్ 29 నవంబర్ 2021 నాడు సందర్శించారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ సాక్షి పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆర్టికల్‌లో కనిపిస్తున్న గోశాల, పోస్టులో కనిపిస్తున్న గోశాల ఒకటి కాదని స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు, ఈ గోశాలలో వై.ఎస్.జగన్ చిత్రపటం పెట్టినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, వై.ఎస్.జగన్ చిత్రపటం పెట్టిన గోశాలలో గేదెలు పాలు ఇస్తున్నాయని షేర్ చేస్తున్న ఈ సాక్షి క్లిప్ మార్ఫ్ చేసినది.