Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఇండోర్ రోడ్డుపై డబ్బులు పడిపోయిన వీడియో పెట్టి, కొరోనా వ్యాప్తి చేయడానికి ముస్లింలు కావాలనే వాటిపై ఉమ్మి పడేసారని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఇండోర్ లో కొరోనా మహమ్మారి వ్యాప్తిచేయడానికి తబ్లిక్ మర్కజ్ లు 100/200/500 నోట్లకు ఉమ్మురాసి అవి ఎగిరిపోకుండా బరువుపెట్టి రద్దీ కూడళ్లలో వదిలేస్తున్నారు’ అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఇండోర్ లో కొరోనా వ్యాప్తి చేయడానికి ముస్లింలు నోట్లకు ఉమ్ము రాసి రద్దీ రోడ్లపై వదిలేసారు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని నోట్లను కావాలని కొరోనా వైరస్ వ్యాప్తి చేయాలని ఎవరు పడేయలేదు. హిరా నగర్ (ఇండోర్) పోలీసులతో FACTLY మాటాడగా, గ్యాస్ సిలిండర్లు వేసే వ్యక్తి దగ్గర నుండి ఆ డబ్బులు జారిపోయి రోడ్డు పై పడిపోయాయని తెలిపారు. అంతేకాదు, ఆ ఘటనకు ముస్లింలకు సంబంధం లేదు; డబ్బులు పడేసుకున్న వ్యక్తి పేరు రామ్ నరేంద్ర యాదవ్. తను ముస్లిం కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని ఘటన గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఆ ఘటనకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి.  రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50, రూ. 10 డినామినేషన్ల కరెన్సీ నోట్లు ఇండోర్ లోని ఒక రోడ్డు పై పడి ఉన్నాయని, మొత్తం ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయులు దొరికాయని, అవి రోడ్డు పైకి ఎలా వచ్చాయో పోలీసులు విచారిస్తున్నారని టైమ్స్ అఫ్ ఇండియా ఆర్టికల్ లో చదవొచ్చు. ఆ ఘటన కి సంబంధించిన మరిన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

అయితే, వీడియోలోని నోట్లను కావాలని కొరోనా వ్యాప్తి చేయాలని కొందరు పడేసారని సోషల్ మీడియాలో షేర్ అవుడడంతో, హిరా నగర్ (ఇండోర్) పోలీసులతో FACTLY ఫోన్ లో మాట్లాడగా, గ్యాస్ సిలిండర్లు వేసే వ్యక్తి దగ్గర నుండి ఆ డబ్బులు జారిపోయి రోడ్డు పై పడిపోయాయని తెలిపారు. ఆ ఘటనకి కొరోనా వైరస్ వ్యాప్తికి అసలు సంబంధంలేదు. అంతేకాదు, ఆ ఘటనకు ముస్లింలకు సంబంధంలేదు; డబ్బులు పడేసుకున్న వ్యక్తి పేరు రామ్ నరేంద్ర యాదవ్. తను ముస్లిం కాదు.

చివరగా, ఇండోర్ రోడ్డుపై డబ్బులు పడిపోయిన వీడియో పెట్టి, కొరోనా వ్యాప్తి చేయడానికి ముస్లింలు కావాలనే వాటిపై ఉమ్మి పడేసారని తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll