ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పెట్టి ‘అయ్యప్పమాల వేసుకున్నందుకు క్రిస్టియన్ స్కూల్లో యాసిడ్ తో బాత్రూమ్ క్లీన్ చేపించిన స్కూల్ యాజమాన్యం. యాసిడ్ పడి గాయపడిన బాలుడు’ అని పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: అయ్యప్ప మాల వేసుకున్నందుకు క్రిస్టియన్ స్కూల్ యాజమాన్యం బాత్రూమ్ క్లీన్ చేపించినప్పుడు యాసిడ్ పడి గాయపడిన బాలుడి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫొటోలోని విద్యార్ధి మరియు కొంతమంది విద్యార్థులు కలిసి తమిళనాడు లోని ఒక స్కూల్ లోని కెమిస్ట్రీ ల్యాబ్ ని శుభ్రం చేస్తున్నప్పుడు, యాసిడ్ పడి గాయపడ్డారు. అయ్యప్ప మాల వేసుకున్నందుకు ఫోటోలోని బాలుడిని స్కూల్ యాజమాన్యం శిక్షించలేదు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
పోస్టులోని స్క్రీన్ షాట్ లో ఉన్న సమాచారం ఆధారంగా ‘Tamilnadu good shepherd school student acid burns’ అని వెతికినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వాటిలోని ‘Times of India’ ఆర్టికల్ లో స్క్రీన్ షాట్ లోని రెండవ ఫోటో యొక్క కొంత భాగాన్ని చూడవచ్చు. ఆ కథనం లో, తమిళనాడు లోని ‘గుడ్ షెపర్డ్ హై స్కూల్’ లోని విద్యార్థులు తమ హెడ్ మాస్టర్ ఆదేశాల మేరకు కెమిస్ట్రీ ల్యాబ్ ని శుభ్రం చేస్తున్నప్పుడు, వారిలోని ఇద్దరిపై యాసిడ్ పడడంతో గాయలయ్యాయని ఉంది. కావున, ఫొటోలోని విద్యార్థి (మహారాజా) గాయపడింది కెమిస్ట్రీ ల్యాబ్ ని శుభ్రం చేస్తున్నప్పుడు.
అదే విషయాన్ని ‘The New Indian Express’ వారి కథనం లో కూడా చూడవచ్చు. అయ్యప్ప మాల వేసుకున్నందుకు తనను స్కూల్ యాజమాన్యం వారు బాత్రూమ్ క్లీన్ చేపించలేదు.
చివరగా, ఫొటోలోని విద్యార్థికి యాసిడ్ గాయలైంది తమ స్కూల్ లోని కెమిస్ట్రీ ల్యాబ్ ని శుభ్రం చేస్తున్నప్పుడు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?