Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ రాత్రి 11:30 నుండి ఉదయం 6:00 గంటల వరకు వాట్సాప్‌ మెసేజ్ లను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోలేదు

0

కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ రాత్రి 11:30 నుండి ఉదయం 6:00 గంటల వరకు వాట్సాప్‌ మెసేజ్ లను నిలిపివేయాలనే నిర్ణయాన్ని ప్రకటించిందని, ఆ మెసేజ్ ని యూజర్స్ తమ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారికి ఫార్వర్డ్ చేయాలని, లేని యెడల వారి వాట్సాప్ అకౌంట్ తొలగించబడుతుందని, అకౌంట్ ని తిరిగి పొందాలంటే వాట్సాప్‌ సంస్థ కి నెలకు 499 రూపాయలు బిల్లు కట్టవలసి ఉంటదని చెప్తూ ఒక మెసేజ్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ రాత్రి 11:30 నుండి ఉదయం 6:00 గంటల వరకు వాట్సాప్‌ మెసేజ్ లను నిలిపివేయాలనే నిర్ణయాన్ని ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ రాత్రి 11:30 నుండి ఉదయం 6:00 గంటల వరకు వాట్సాప్‌ మెసేజ్ లను నిలిపివేయాలనే నిర్ణయాన్ని తీసుకోలేదు. అది ఒక ‘ఫేక్’ మెసేజ్. అది గత కొంత కాలంగా సోషల్ మీడియా లో చలామణీలో ఉంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

కేంద్ర ప్రభుత్వం పోస్టులో చెప్పిన విషయం గురించి ఏమైనా ప్రకటన చేసిందా అని తెలుసుకోవడానికి గూగుల్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, అలాంటి మెసేజే ఇంటర్నెట్ పై 2013 నుండి చలామణీలో ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుత మెసేజ్ కి 2013 నుంచి ఉన్న మెసేజ్ కి తేడాలు ఏమిటంటే అది వాట్సాప్ సీఈవో ఆరోహి దేశముఖ్ అనే వ్యక్తి పేరు మీద ఉంటుంది మరియు బిల్ 25 రూపాయలని ఉంటుంది. మిగతా విషయమంతా ఆ రెండు మెస్సేజుల్లో ఒకేలా ఉండడం చూడవచ్చు. 

అంతేకాదు, సెర్చ్ రిజల్ట్స్ లో ‘Times of India’ 2014 లో అలాంటి మెసేజ్ ‘ఫేక్’ అని చెప్తూ ప్రచురించిన కథనం లభించింది. వాట్సాప్ లో అప్పుడు కొత్తగా వచ్చిన ‘బ్లూ టిక్స్’ ఫీచర్ ని ఆధారంగా చేసుకుని అలాంటి తప్పుడు మెసేజ్ ని షేర్ చేశారని ఆ కథనం లో ఉంది. 

చివరిగా, కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ రాత్రి 11:30 నుండి ఉదయం 6:00 గంటల వరకు వాట్సాప్‌ మెసేజ్ లను నిలిపివేయాలనే నిర్ణయం ప్రకటించలేదు. అది ఒక ‘ఫేక్’ మెసేజ్.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll