Fake News, Telugu
 

మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీ పైన కాళ్ళు పెట్టుకున్న ఫోటో ఎడిట్ చేసినది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్టూలు మీద కాళ్ళు పెట్టుకున్న ఫోటోని మార్ఫ్ చేసి ప్రపంచ కప్ ట్రోఫీ మీద తాను కాళ్ళు పెట్టుకున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్తూ రెండు ఫోటోల కొల్లాజ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ  చూద్దాం. 

క్లెయిమ్: ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ స్టూలు మీద కాళ్ళు పెట్టుకున్న ఫోటీని ఎడిట్ చేసి ప్రపంచ కప్ ట్రోఫీ పైన కాళ్ళు పెట్టుకున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

ఫాక్ట్(నిజం): ఆస్ట్రేలియా జుట్టు ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత, ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తోటి ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీ పైన కాళ్ళు పెట్టుకున్న ఫోటో అప్లోడ్ చేశారు. ఇలా మార్ష్ ట్రోఫీపై కాళ్ళు పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని ఆన్లైన్లో చర్చ కూడా జరిగింది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా ఈ విషయం గురించి అనేక వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు లభించాయి. 

ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత ఆ జట్టు ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీ పైన కాళ్ళు పెట్టుకొని కూర్చున్న ఫోటో ఒకటి ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంస్టాగ్రామ్ స్టోరీగా పోస్టు చేసాడని టైమ్స్ ఆఫ్ ఇండియా వారు రిపోర్టు చేశారు. ఐతే ఇలా మార్ష్ ట్రోఫీ పైన కాళ్ళు పెట్టుకోవడం ప్రపంచ కప్పుని అగౌరవ పరిచేలా ఉంది అని సోషల్ మీడియా యూజర్లు తమ అభిప్రాయాన్ని తెలిపినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

ప్యాట్ కమిన్స్ ఇంస్టాగ్రామ్ స్టోరీ కోసం తన సారి హైలైట్స్‌లో మేము వెతికాము, కానీ ఈ ఫోటో మాకు హైలైట్స్‌లో దొరకలేదు. ఇంస్టాగ్రామ్ స్టోరీలో అప్లోడ్ చేసిన ఫోటో 24 గంటలు మాత్రమే ఉంటుంది, ఒకవేళ ఆ ఫోటీని హైలైట్స్‌లో ఆడ్ చేయకపోయి ఉంటే కానుగాక అది 24 గంటల తర్వాత మనకి కనిపించదు (ఇక్కడ). కానీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీని స్క్రీన్‌షాట్ తీసి వార్తా కథనాల్లో షేర్ చేసారు.

ఈ ఫోటోని ఎడిట్ చేసి మార్ష్, కప్ మీద కాక, స్టూలు మీద కాళ్ళు పెట్టుకున్నాడు అని, ఆ ఫోటోని ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని తప్పుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మీరు కనుక సరిగ్గా గమనిస్తే, అసలు ఫోటోలో స్టూలు ఉంది అని షేర్ చేస్తున్న ఫోటోలో స్టూలు దగ్గర మార్ష్ యొక్క కాళ్ళ భాగం మసక మసకగా ఉంది. దీన్ని ఎడిట్ చేసిన వాళ్ళు సరిగ్గా చేయలేదు. కొందరు సోషల్ మీడియా యూసర్లు కూడా ఈ పోస్టు కామెంట్స్‌లో తమ సందేహాన్ని తెలిపారు.  

చివరిగా, మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీ పైన కాళ్ళు పెట్టుకున్న ఫోటో ఎడిట్ చేసింది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మార్ష్ నిజంగానే వరల్డ్ కప్ ట్రోఫీ పైన కాళ్ళు పెట్టుకొని ఫోటో దిగాడు. 

Share.

About Author

Comments are closed.

scroll