Fake News, Telugu
 

MGM హాస్పిటల్ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని వారి కుటుంభానికి అందించలేదన్న వార్తలో నిజం లేదు.

0

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చికిత్స కోసం అయిన హాస్పిటల్ బిల్ 3 కోట్ల రూపాయలు పూర్తిగా కట్టని తరుణంలో హాస్పిటల్ వారు SPB పార్థివదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించలేదు, ఈ సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి కూతురు జోక్యం చేసుకొని SPB పార్థివదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించేలా చూసారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చికిత్స కోసం అయిన హాస్పిటల్ బిల్ 3 కోట్ల రూపాయలు పూర్తిగా కట్టని తరుణంలో హాస్పిటల్ వారు SPB పార్థివదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించలేదు, ఈ సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి కూతురు జోక్యం చేసుకొని SPB పార్థివదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించేలా చూసారు.

ఫాక్ట్(నిజం): హాస్పిటల్ బిల్ పూర్తిగా కట్టని కారణంగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని MGM హాస్పిటల్ వారు తమ కుటుంబానికి అందించలేదని వస్తున్న వార్త పూర్తి అవాస్తవం అని అయన కుమారుడు ఎస్.పి. చరణ్ స్పష్టం చేసారు. పైగా పోస్టులో చెప్పిన విషయం గురించి ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం వెతికే క్రమంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కుమారుడైన ఎస్.పి. చరణ్, పోస్టులో ఉన్న విషయం గురించి వివరణ ఇస్తూ తన ఫేస్ బుక్ ఎకౌంటులో షేర్ చేసిన ఒక వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో ద్వారా MGM హాస్పిటల్ వారు బిల్ కట్టని కారణంగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని వారి కుటుంబానికి అందించలేదని వస్తున్న వార్తలలో నిజం లేదని ఎస్.పి. చరణ్ స్పష్టం చేసారు.

ఇదే వీడియోని ప్రసారం చేసిన ఈటీవీ వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. పైగా పోస్టులో చెప్పిన విషయమై ఎటువంటి వార్తా మాకు కనిపించలేదు. దీన్నిబట్టి పోస్టులో చెప్పిన వార్తలో నిజం లేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం నేపధ్యంలో MGM హాస్పిటల్ పైన వస్తున్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll