Fake News, Telugu
 

వీడియోలో దెబ్బలు తింటున్న వ్యక్తి కన్నయ్య కుమార్ కాదు

0

ఒక అతన్ని కొంతమంది వ్యక్తులు కొడుతున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అందులో దెబ్బలు తింటున్న వ్యక్తి సీపీఐ నేత కన్నయ్య కుమార్ అని చెప్తున్నారు. పోస్టులో పేర్కొన్న విషయంలో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సీపీఐ నేతకన్నయ్య కుమార్ ని ప్రజలు కొడ్తున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): వీడియోలోని వ్యక్తులు కొడ్తున్నది కన్నయ్య కుమార్ ని కాదు. బీహార్ లోని ఒక సభ లో కన్నయ్య కుమార్ ప్రసంగిస్తున్నప్పుడు, చందన్ కుమార్ అనే వ్యక్తి స్టేజ్ పైకి చెప్పులు విసిరినందుకు గానూ అక్కడ ఉన్న జనం అతన్ని పట్టుకుని కొట్టారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

పోస్టులోని వీడియో క్లిప్ పైన ‘Kashish News’ అనే లోగో ఉండడం చూడవచ్చు. దాంతో, ఆ చానెల్ యొక్క యూట్యూబ్ అకౌంట్ లో చూసినప్పుడు, ఆ వీడియో లభించింది. దాని టైటిల్ ద్వారా, లఖిసరై(బీహార్) లో కన్నయ్య ప్రసంగాన్ని ఒక యువకుడు అడ్డుకున్నందుకు గానూ అతన్ని అక్కడ ఉన్న ప్రజలు కొట్టినట్లుగా తెలిసింది. ఆ సభకే సంబంధించిన మరో వీడియో ని చూసినప్పుడు, అందులో కన్నయ్య ‘నీలం’ రంగు చొక్కాలో కనిపిస్తాడు మరియు దాడి చేసి దెబ్బలు తిన్న వ్యక్తి ‘నారింజ’ రంగు చొక్కాలో కనిపిస్తాడు. ‘Danik Bhaskar’ కథనం ద్వారా, లఖిసరై(బీహార్) లోని ఒక సభ లో కన్నయ్య కుమార్ ప్రసంగిస్తున్నప్పుడు, చందన్ కుమార్ అనే వ్యక్తి స్టేజ్ పైకి చెప్పులు విసిరినందుకు గానూ అక్కడే ఉన్న జనం అతన్ని పట్టుకుని కొట్టారు అని తెలిసింది.

చివరగా, పోస్టులోని వీడియోలో దెబ్బలు తింటున్న వ్యక్తి కన్నయ్య కుమార్ కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll