Fake News, Telugu
 

ఆ వ్యక్తి పోలీసుని కొట్టింది రోడ్డు పై గుంతలు మరియు సిగ్నల్ లైట్ బాగుచేయకుండా తనకి చలానా వేసినందుకు కాదు

1

ఒక వ్యక్తి పోలీసుని రోడ్డుపై కొడ్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, అతను పోలీసుని రోడ్డు పై గుంతలు మరియు సిగ్నల్ లైట్ బాగు చేయకుండా తనకి చలానా వేసినందుకు కొట్టాడు అని ఆరోపిస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : వీడియోలో ఆ వ్యక్తి పోలీసుని రోడ్డు పై గుంతలు మరియు సిగ్నల్ లైట్ బాగు చేయకుండా తనకి చలానా వేసినందుకు కొట్టాడు.

ఫాక్ట్ (నిజం): హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతున్నందుకు పోలీసు కానిస్టేబుల్ ఆ వాహనదారుడుని ప్రశ్నించడంతో, ఆగ్రహించిన ఆ వ్యక్తి పోలీసుని కొట్టాడు. కావున, పోస్టులో చేసిన ఆరోపణ తప్పు

పోస్టు లో ఉన్న వీడియోని ‘ఇన్విడ్’ ప్లగిన్ లో అప్లోడ్ చేసినప్పుడు, దాని యొక్క కీఫ్రేమ్స్ వచ్చాయి. ఆ కీఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఒక కీఫ్రేమ్ “ఈనాడు” వారు ప్రచురించిన కథనం లో లభించింది. ఆ కథనం ద్వారా, ఒక వ్యక్తి  హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతున్నందుకు పోలీసు కానిస్టేబుల్ ప్రశ్నించడంతో, అతను కోపంగా ఆ పోలీసు అధికారి పై దాడికి దిగినట్లుగా తెలిసింది.

అదే విషయాన్ని తెలుపుతూ “India times” వారు ప్రచురించిన కథనం ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం ప్రకారం, ట్రాఫిక్ హోమ్ గార్డ్ కి మరియు ఇంకో వ్యక్తి కి హెల్మెట్ విషయంలో గొడవ జరిగి, అది ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేదాకా పోయింది.

చివరగా, వీడియోలో ఆ వ్యక్తి పోలీసుని కొట్టింది హెల్మెట్ ధరించలేదని ప్రశ్నించినందుకు, రోడ్డు పై గుంతలు మరియు సిగ్నల్ లైట్ బాగుచేయకుండా తనకి చలానా వేసినందుకు కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll