Fake News, Telugu
 

నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 తేదీలలో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ కు ఇంగ్లాండ్ నుండి వైద్యులు రావట్లేదు

1

సినీనటుడు మహేష్ బాబు గారి సహాయం తో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 తేదీ వరుకు ఇంగ్లాండ్ నుండి వస్తున్న ప్రాముఖ్యత గలా వైద్యులు వస్తున్నారు. కావున ఎవరైనా 18 సంవత్సరాల లోపు తక్కువ ఉన్న చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయబడును. సంప్రదించు నంబర్లు:9494606677 9494254206 దయచేసి మహేష్ బాబు గారు చేయుచున్న ఈ ప్రయత్నాన్ని అందరికి తెలియజేయండి’ అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వ్యాపిస్తోంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందొ విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : గుండె జబ్బుతో బాధపడ్తున్న18 సంవత్సరాల లోపు చిన్నారులకు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో నవంబర్ 28 నుండి డిసెంబర్ 5వ తేదీ వరుకు ఇంగ్లాండ్ నుండి వచ్చిన వైద్యులు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయబడును.

ఫాక్ట్ (నిజం): విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆ విషయం గురించి సంప్రదించినప్పుడు అలాంటి కార్యక్రమం ఏమీ లేదనీ, అది ఒక ఫేక్ న్యూస్ అని తెలిపారు. కావున, పోస్టులో చెప్పిన విషయం అబద్ధం

ఫేస్బుక్ పోస్టులో ఆరోపించినట్లుగా  విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ వారు ఉచితంగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసే కార్యక్రమం నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 తేదీ వరకు చేపడ్తున్నారా అని “FACTLY” వారు ఆ హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించినప్పుడు, అలాంటి కార్యక్రమం ఏమీ లేదనీ, అదొక ‘ఫేక్ న్యూస్’ అని తెలిపారు.

విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ కి మహేష్ బాబు సహాయం గురించిన సమాచారం కోసం వెతికినప్పుడు, మహేష్ బాబు తోడ్పాటుతో ఆంధ్ర హాస్పిటల్ వారు గత మూడున్నర సంవత్సరాలలో సుమారు 1000 మందికి గుండె సంబంధిత చికిత్సలను ఉచితంగా చేసినట్లుగా “The Hindu” వార్తా పత్రిక వారు ఇటీవల ప్రచురించిన కథనం ద్వారా తెలిసింది.

చివరగా, మహేష్ బాబు అందిస్తున్న సహాయం తో ఆంధ్ర హాస్పిటల్స్ వారు లండన్ కి సంబందించిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ (HLH) సహకారం తో గత మూడున్నర సంవత్సరాలుగా పిల్లలకి ఉచిత చికిత్స చేస్తున్నా, పోస్టులో ప్రచారం చేసినట్టు నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 తేదీ వరుకు చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయటం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll