Fake News, Telugu
 

కొచ్చిలోని లులు మాల్‌లో క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా అన్ని దేశాల జెండాలు ప్రదర్శించారు, మరియు ఫ్లాగ్ కోడ్ నియమాలను ఉల్లంగించలేదు

0

Update (13 October 2023):

పాకిస్తాన్ జెండాని భారతీయ జెండా కంటే ఎత్తులో లులు మాల్ కొచ్చిలో ప్రదర్శించారని చెప్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు, “FLAG కోడ్ ప్రకారం త్రివర్ణ పతాకం పైన, దానికంటే ఎత్తుగా లేదా పక్కన ఏ ఇతర జెండాను ఉంచకూడదు” అని కూడా ఈ ఫోటోలని షేర్ చేస్తూ క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మొదటగా, ఈ విషయం పైన లులు మాల్ కొచ్చి వారు ప్రెస్ రిలీజ్ ద్వారా స్పందిస్తూ, క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా, పోటీలో పాల్గొంటున్న అన్ని దేశాల జెండాలని పోటీ మొదటిరోజు వారి మాల్‌లో ప్రదర్శించారని, అన్ని జెండాలను ఒకే ఎత్తులో సీలింగ్ నుండి వేలాడదీశారు అని చెప్పారు.

ఫోటో తీసిన కోణాన్ని బట్టి తగిలించిన జండాలు పెద్దగా కనిపించడం సహజమే కానీ, పాకిస్తాన్ జెండా భారత జెండా కంటే ఎత్తులో తగిలించారు అనే వాదనలో వాస్తవం లేదు అని వారు చెప్పారు. ఈ ఆర్టికల్ కింద భాగంలో మీరు ఆ వివరాలతో పాటు లులు మాల్‌లో ఎగరేసిన జెండాల ఫోటోలు చూడవచ్చు.

రెండవది, Flag Code of India, 2002లోని సెక్షన్ I ప్రకారం భారత జెండాను వేరే జెండాలతో (పొలిటికల్ పార్టీ జెండా, మతపరమైన జెండాలు లాంటివి) లేదా Bunting (అలంకారంగా వాడే జెండా)లని భారత జాతీయ జెండా కంటే ఎత్తులో కానీ, పైన కానీ, పక్కనే కానీ ఎగుర వెయ్యకూడదు/ఉంచకూడదు.

కానీ,  Flag Code of India, 2002లోని సెక్షన్ VII ప్రకారం,ఇతర దేశాల జాతీయ జెండాలతో మన జెండాను display చేసేటప్పుడు జెండా మాష్టులు అన్నీ ఒకే సైజులో ఉండాలి. అంతర్జాతీయ వాడుక ప్రకారం, రెండు దేశాల మధ్య శాంతి పరమైన సంబంధాలు ఉన్నప్పుడు ఒక దేశం యొక్క జెండాని ఇంకో దేశ జెండా కంటే ఎత్తులో ఎగుర వెయ్యకూడదు.

కొచ్చిలోని లులు మాల్‌లో ప్రదర్శించిన పది దేశాల జెండాలన్నిటిని ఒకే ఎత్తులో ఉంచారు అని లులు వారు ప్రెస్ రిలీజ్ ద్వారా క్లారిఫై చేశారు. ఒకే ఎత్తులో అన్ని జెండాలను ఉంచారు (ఇక్కడ, ఇక్కడ) కాబట్టి ఇది వైరల్ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్లు Flag Code of India, 2002ని ఉల్లంఘించినట్లు కాదు.

ఇటీవల మన దేశంలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా display చేసిన G20 దేశాల జెండాల ఫోటోలు చూస్తే, అన్ని సమానమైన ఎత్తులో ఉంచారు అని స్పష్టంగా అర్థమవుతుంది (ఇక్కడ, ఇక్కడ).

Published (11 October 2023):

“20×60 అడుగుల పాకిస్థాన్ జాతీయ పతాకాన్ని కొచ్చిన్ లోని తమ మాల్ ముదు(ముందు) ప్రదర్శించిన ‘లూలూ’ మాల్” అని చెప్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం. 

క్లెయిమ్: కొచ్చిన్‌లోని లులు మాల్‌లో పాకిస్థాన్ జాతీయపతాకాన్ని ప్రదర్శించారు. 

ఫాక్ట్(నిజం): 2023 పురుషుల వరల్డ్ కప్ ఆరంభం అయిన సందర్భంగా కొచ్చిన్‌లోని లులు మాల్‌లో వరల్డ్ కప్ పోటీలో పాల్గొంటున్న పది దేశాల జెండాలను ప్రదర్శించారని లులు మాల్ కొచ్చిన్ వారు ఒక ప్రెస్ రిలీజ్‌లో చెప్పారు. అన్ని జెండాలు కలిగి ఉన్న ఫోటోలు కూడా వార్తా కథనాల్లో వచ్చాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

అసలు ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవటానికి, ముందుగా ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతుకగా. ఈ విషయమై లులు మాల్ కొచ్చిన్ వారు ఒక ప్రెస్ రిలీజ్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు అని తెలిసింది(ఇక్కడ మరియు ఇక్కడ).

ఏషియా నెట్ న్యూస్ వారు ప్రచురించిన కథనం ప్రకారం లులు మాల్ వారు ఈ ప్రెస్ రిలీజ్‌లో వారు వరల్డ్ కాప్ క్యాంపైన్‌లో భాగంగా, టోర్నమెంటు మొదటి రోజు, పోటీలో పాల్గొంటున్న అన్ని దేశాల జెండాలు ప్రదర్శించారని చెప్పారు. ఈ వార్తా కథనంలో ఆ జండాలని ప్రదర్శించిన ఫోటోలని మీరు చూడవచ్చు.

అదనంగా, లులు మాల్ యొక్క  అఫీషియల్స్  ఇండియా టుడే వారితో  ఈ విషయం గురించి మాట్లాడుతూ వారి మాల్‌లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్(LED స్క్రీన్ పైన) చేయడానికి చేసిన సెటప్ ఇనాగరెట్ చెయ్యటానికి చేసిన ప్రోగ్రాంలో భాగంగా, పోటీలో పాల్గొంటున్న పది దేశాల జెండాలు ప్రదర్శించారని చెప్పారు. ఈ ప్రోగ్రాం అయ్యాక అన్ని జెండాలను తెసివేశారని, క్రికెట్ మ్యాచ్ ఏ కాదు అన్ని పెద్ద ఈవెంట్లని ఇలా స్క్రీన్ మీద ప్రదర్శిస్తారని చెప్పారు. 

ఇదంతా కాక, వైరల్ అవుతున్న ఫోటోని కనుక మీరు సరిగ్గా గమనిస్తే ఫోటో కింద భాగంలో నెదర్లాండ్స్ దేశం జెండాని కూడా చూడవచ్చు. 

చివరిగా, కొచ్చిన్‌లోని లులు మాల్‌లో వరల్డ్ కప్ సందర్భంగా అన్ని దేశాల జెండాలు ప్రదర్శించారు, పాకిస్తాన్ జెండా ఒక్కటే కాదు

Share.

About Author

Comments are closed.

scroll