లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) లో బీటెక్ చదువుతున్న తాన్యా అరోరా అనే విద్యార్థినికి రూ. 5.04 కోట్ల ప్యాకేజీ తో హైదరాబాద్లో ఉద్యోగం వచిన్నట్టు సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: ఎల్‌పీయూ విద్యార్థినికి రూ. 5.04కోట్ల ప్యాకేజీ.
ఫాక్ట్ (నిజం): ఎల్‌పీయూ విద్యార్థిని తాన్యా అరోరా కి సంవత్సరానికి రూ. 42 లక్షల ప్యాకేజీ తో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, రూ. 5.04 కోట్ల ప్యాకేజీతో కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ప్రముఖ వార్తాసంస్థలు [సాక్షి (ఆర్కైవ్డ్ వెర్షన్), సాక్షి పోస్ట్ (ఆర్కైవ్డ్ వెర్షన్), నవ తెలంగాణ (ఆర్కైవ్డ్ వెర్షన్) మరియు ప్రజా శక్తి (ఆర్కైవ్డ్ వెర్షన్)] [ టీవీ9 వారు కూడా ఈ విషయం పై ఆర్టికల్ పెట్టి తీసేసారు. ఆ ఆర్టికల్ కాష్డ్ వెర్షన్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు] కూడా పోస్ట్ లోని విషయాన్నే ప్రచురించినట్టు తెలుస్తుంది.
అయితే, ఈ విషయం గురించి ఎల్‌పీయూ కాలేజీ వెబ్ సైట్ లో వెతకగా, తాన్యా అరోరా కి సంవత్సరానికి రూ.42 లక్షల ప్యాకేజీ తో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని కాలేజీ వారు తమ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన్నట్టు ఇక్కడ చూడవొచ్చు. కావున, సంవత్సరానికి రూ. 42 లక్షల ప్యాకేజీ వస్తే, అది నెలకు అనుకొని సంవత్సరానికి రూ. 5.04 కోట్ల ప్యాకేజీ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
చివరగా, ఎల్‌పీయూ విద్యార్థినికి సంవత్సరానికి రూ. 42 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది, రూ. 5.04 కోట్ల ప్యాకేజీతో కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఎల్‌పీయూ విద్యార్థినికి సంవత్సరానికి రూ. 42 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది, రూ. 5.04 కోట్ల ప్యాక