ఒక వీడియో ని ఫేస్బుక్ లో పెట్టి, అది దుబాయ్ లో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించినదని పోస్టు చేస్తున్నారు. ఆ ఆరోపణ ఎంతవరకు నిజమో చూద్దాం.
క్లెయిమ్: దుబాయ్ లో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియో లో ఫైర్ వర్క్స్ కనిపించేది సౌత్ కొరియాలోని ‘లొట్టె వరల్డ్ టవర్’ పైన. కావున, వీడియో దుబాయ్ లో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించింది అనేది తప్పు.
పోస్టులో కనిపించే బిల్డింగ్ మీద ‘Lotte World’ అని కనిపిస్తుంది. దాంతో, గూగుల్ లో ‘Lotte World Fireworks’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ‘లొట్టె వరల్డ్ టవర్’ ఫైర్ వర్క్స్ సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. ‘లొట్టె వరల్డ్ టవర్’ గురించి వెతికినప్పుడు అది సౌత్ కొరియాలోని ఒక మాల్ అని తెలుస్తుంది. ఆ మాల్ యొక్క ఫోటో లను చూసినప్పుడు, వీడియోలో కనిపించే బిల్డింగ్ ని పోలి ఉన్నట్లుగా చూడవచ్చు.
వీడియో యొక్క అనేక స్క్రీన్ షాట్స్ ని కూడా యండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘లొట్టె వరల్డ్ టవర్’ ఫైర్ వర్క్స్ వీడియో అని చాలా సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఆ వీడియో ఏ సందర్భానికి చెందినదని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అందుకు సంబంధించిన విశ్వసనీయ సమాచారమేమీ లభించలేదు. కానీ, అది దుబాయ్ కి చెందిన వీడియో కాదని మాత్రం చెప్పవచ్చు.
చివరగా, ఆ వీడియో సౌత్ కొరియా లోని ‘లొట్టె వరల్డ్ టవర్’ పై నిర్వహించిన ఫైర్ వర్క్స్ కి సంబంధించినది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: దుబాయ్ లో దీపావళి వేడుకలు కాదు, సౌత్ కొరియా లోని ‘లొట్టె వరల్డ్ టవర్’ పై నిర్వహించిన ఫైర్ వర్క్