Fake News, Telugu
 

కర్ణాటక ప్రభుత్వం పురుషులకు మాత్రమే ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించలేదు. ఈ ఫోటో మార్ఫింగ్ చేయబడింది

0

రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. Mens-Only (‘పురుషులు మాత్రమే’) అని రాసి ఉన్న ఓ బస్సు ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో పురుషులకు మాత్రమే బస్సు సర్వీసు ప్రారంభించినట్లు సూచిస్తూ ఆ బస్సు యొక్క  చిత్రంగా దీన్ని చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ క్లయిములోని వాస్తవాన్ని తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో పురుషుల కోసం మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించబడ్డ బస్సు ఫోటో. 

ఫాక్ట్ (నిజం): వైరల్ ఫోటో ఎడిట్ చేయబడినది. దీని అసలు వెర్షన్ 2017లో తీయబడింది. బస్సు మీద ఎక్కడా “Mens-Only” అని రాసి లేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, కర్నాటక ప్రభుత్వం పురుషులకు మాత్రమే ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించిందో లేదో తెలుసుకోవడానికి మేము ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికాము. ప్రభుత్వం నిర్వహించే బస్సుల్లో ఆ రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని వచ్చిన వార్తాకథనాలు మినహా, పురుషులకు మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభింపబడిన బస్సులకు సంబంధించి మాకు ఎటువంటి సమాచారం కనిపించలేదు.

మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మేము వైరల్ ఫోటోను ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇది 2017లో టాటా మోటార్స్ విడుదల చేసిన ఒక ప్రెస్ రిలిజ్‌కి దారితీసింది. ఇందులో వైరల్ ఫోటో యొక్క అసలైన వెర్షన్‌ ఉంది. ఈ ఫొటోలో బుస్సుపైన Mens-Only ( “పురుషులు మాత్రమే” ) అని రాసి లేదు.


2017లో టాటా మోటార్స్ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కి 30 కొత్త బస్సులను పంపిణీ చేసింది, దానికి సంబందించిన ప్రెస్ రిలీజ్ ఇది. ఈ ఫోటోను క్రాప్ చేసి, దానిపైన “Mens-Only” అనే టెక్స్ట్ జోడించి వైరల్ ఫోటోని తయారు చేసారు. ఇదే ఫోటోను డెక్కన్ హెరాల్డ్ మరియు వన్ ఇండియా తమ కథనాలలో రిప్రెసెంటేషనల్ ఫోటోగా గతంలో ఉపయోగించాయి.

చివరిగా, కర్ణాటక ప్రభుత్వం పురుషులకు మాత్రమే బస్సు సర్వీసును ప్రారంభించలేదు. ఈ ఫోటో మార్ఫింగ్ చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll