ప్రముఖ నటుడు కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసాడని చెప్తున్న పోస్టులు కొన్ని సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఆ పోస్టులలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసాడు.
ఫాక్ట్ (నిజం): కమల్ హాసన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ పై ఈ విమర్శలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ కమల్ హాసన్ నిజంగానే ఇలా విమర్శలు చేసి ఉంటే తెలుగు మరియు తమిళ, తెలుగు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి, కాని మాకు దీనికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెపుతున్న విషయం గురించి ఇంటర్నెట్ లో వేతకగా కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ పై పోస్టులో ప్రస్తావించిన విమర్శలు చేసాడని చెప్పే ఎటువంటి వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారం గాని మాకు లభించలేదు.
ఒకవేళ కమల్ హాసన్ నిజంగానే జగన్ మరియు పవన్ కళ్యాణ్ పై ఇలా విమర్శలు చేసి ఉంటే మీడియా (ముఖ్యంగా తెలుగు మీడియా) కచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేది, కాని ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. పైగా కమల్ హాసన్ ఇలా విమర్శలు చేసాడని చెప్తూ తమిళ వార్తా సంస్థలు కూడా ఎలాంటి కథనాలు ప్రచురించలేదు. కమల్ హాసన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. అలాగే కమల్ హాసన్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో కూడా జగన్ మరియు పవన్ ని విమర్శిస్తూ ఎటువంటి పోస్టులు లేవు. కాబట్టి పోస్టులో చెప్తున్న విషయాలు నిజం కాదని అర్ధం చేసుకోవచ్చు.
తిరుపతి లోక్ సభ నియోజికవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
చివరగా, కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో జగన్ మరియు పవన్ పై ఈ విమర్శలు చేయలేదు.