Fake News, Telugu
 

ఈ వీడియోలో జ్యోతిరాదిత్య సింధియా భారతీయ విద్యార్థులతో మాట్లాడుతున్నది రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లో, ఉక్రెయిన్‌లో కాదు

0

‘ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల దగ్గరకి చేరుకున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా’ అంటూ కేంద్ర మంత్రి విద్యార్థులతో మాట్లాడుతున్న వీడియోని షేర్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. జ్యోతిరాదిత్య సింధియా, ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్‌లో భారతీయులు ఉన్న ప్రదేశాలకు వెళ్లి వారితో మాట్లాడుతున్నాడంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆపరేషన్ గంగాలో భాగంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉక్రెయిన్‌కు వెళ్ళి, అక్కడి భారతీయు విద్యార్థులతో మాట్లాడుతున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఉక్రెయిన్‌ నుండి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకున్న భారతీయ విద్యార్థులను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరామర్శిస్తున్న సందర్భంలో తీసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ ఇతర దేశాలతో పౌర విమానాయాన సేవలను మొత్తం రద్దు చేసింది. కాబట్టి జ్యోతిరాదిత్య సింధియా ఉక్రెయిన్‌కు వెళ్ళలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియోలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా భారతీయ విద్యార్థులతో మాట్లాడుతున్నది ఉక్రెయిన్‌లో కాదు, రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లో.

కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ‘ఆపరేషన్ గంగా’ ద్వారా తిరిగి భారత్‌కు తరలిస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ ఇతర దేశాలతో పౌర విమానాయాన సేవలను మొత్తం రద్దు చేసింది. ఇందువల్ల ఉక్రెయిన్‌ పొరుగు దేశాల బోర్డర్‌కు చేరుకున్న భారతీయులను తిరిగి భారత్‌కు తరలిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు నలుగురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్‌ పొరుగు దేశాలకు వెళ్లారు.

జ్యోతిరాదిత్య సింధియా రొమానియాలో, హర్దీప్ సింగ్ పూరీ హంగేరీలో , కిరెన్ రిజిజు స్లోవేకియాలో మరియు వీకే సింగ్‌ పోలాండ్‌లో భారతీయులను తరలించే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఐతే పోస్టులోని వీడియో, ఉక్రెయిన్‌ నుండి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ చేరుకున్న భారతీయ విద్యార్థులను జ్యోతిరాదిత్య సింధియా పరామర్శించిన సందర్భంలో తీసింది. ఇదే వీడియోని 02 మార్చ్ రోజు పలు వార్తా కథనాలు కూడా ప్రసారం చేసాయి. ఈ కథనాలు కూడా ఈ వీడియో బుకారెస్ట్‌ తీసిందని రిపోర్ట్ చేసాయి. ఈ కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఈ వీడియోలో జ్యోతిరాదిత్య సింధియా భారతీయ విద్యార్థులతో మాట్లాడుతున్నది రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లో, ఉక్రెయిన్‌లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll