Fake News, Telugu
 

అఫ్జల్ గురు ఫోటో పెట్టుకొని కన్నయ్య కుమార్ ఎన్నికల ప్రచారం చేయలేదు.

0

సీపీఐ పార్టీ తరఫున కన్నయ్య కుమార్ బెగుసరాయ్ (బిహార్ రాష్ట్రం) పార్లమెంటు స్థానానికి పోటీచేస్తున్నట్టు అందరికి తెల్సిందే. కానీ తాజాగా తను ఒక ఉగ్రవాది ఫోటో పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తునట్టు ఒక ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కన్నయ్య కుమార్ బెగుసరాయ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముస్లిం తీవ్రవాది అఫ్జల్ గురు ఫోటో తన ప్రచార వాహనం మీద పెట్టుకొని ప్రచారం చేసాడు.

ఫాక్ట్ (నిజం): కన్నయ్య కుమార్ తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసిన అసలు ఫోటో చూస్తే అఫ్జల్ గురు ముఖం ఉన్న దగ్గర సీపీఐ చిహ్నం ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని ఫోటో కోసం కన్నయ్య కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు వెతకగా, తన ఫేస్బుక్ అకౌంట్ లో ఒరిజినల్ ఫోటో దొరుకుతుంది. ఏప్రిల్ 27న తన ఫేస్బుక్ అకౌంట్ లో బెగుసరాయ్ లో ఎన్నికల ప్రచరం అంటూ ఒరిజినల్ ఫోటో పోస్ట్ చేసినట్టుగా చూడవచ్చు. ఒరిజినల్ ఫోటో చూస్తే అఫ్జల్ గురు స్థానంలో సీపీఐ చిహ్నం ఉంటుంది. వైరల్ అవుతున్న ఫోటోలో సీపీఐ చిహ్నం మీద అఫ్జల్ గురు ఫోటోని ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ సహాయంతో అతికించారు. కావున అందరు షేర్ చేస్తున్నది ఒక ఎడిటెడ్ ఫోటో.

చివరగా, అఫ్జల్ గురు ఫోటో పెట్టుకొని కన్నయ్య కుమార్ ఎన్నికల ప్రచారం చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll