Fake News, Telugu
 

ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలుపు ఖాయం అని చెప్తున్న ఈ TV9 వార్తా కథనం 2018 అసెంబ్లీ ఎన్నికల నాటిది

0

ఇండియా టుడే సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి (భారత రాష్ట్ర సమితి) రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ఖాయమని చెప్తున్న ఒక TV9 వార్తా కథనం యొక్క క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కథనం వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) విజయం సాధిస్తుందని ఇటీవల అంచనా వేసిన ఇండియా టుడే సర్వే గురుంచి TV9 వార్తా కథనం వీడియో.

ఫాక్ట్(నిజం): నిజానికి,ఈ వీడియో క్లిప్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియా టుడే చేసిన సర్వే గురించి TV9లో వచ్చిన వార్తా కథనంలోనిది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు జోస్యం చెప్తున్న వీడియో అంటూ ఈ ఐదేళ్ల నాటి ఇండియా టుడే సర్వేకి చెందిన వార్తా కథనం సోషల్ మీడియాలో తప్పుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిలా ఉంది.

వైరల్ క్లెయిమ్ యొక్క ఖచ్చితత్వాన్ని చెక్ చెయ్యటానికి, మేము తగిన కీవర్డ్‌లతో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వే యొక్క అసలు వీడియో రిపోర్టుకి దారి తీసింది. ఇందులోని ఒక చిన్న భాగాన్ని తీసి వైరల్ క్లిప్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సింది, ఈ వీడియో ఐదేళ్ల క్రితం నాటిది అని. ఇది గత (2018) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియా టుడే వారు చేసిన ఎన్నికల సర్వేని రిపోర్టు చేసిన TV9 వీడియో.

`

వైరల్ క్లిప్‌ను వీడియో ప్రారంభం నుండి చూడవచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ (ప్రస్తుత భారత రాష్ట్ర సమితి) విజయాన్ని అంచనా వేసిన ఇండియా టుడే సర్వే గురించి చేసిన రిపోర్టు రాబోయే 2023 ఎన్నికలతో ముడిపడి ఉన్నట్లు తప్పుగా షర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.

చివరిగా, వైరల్ వీడియో పాతది, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదు. 

Share.

About Author

Comments are closed.

scroll