Fake News, Telugu
 

ఈ వీడియో బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ నాయకుడు షాహిదుల్ ఇస్లాం హిరాన్ మృతదేహాన్ని ఓ విగ్రహానికి వేలాడదీసి దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నది.

0

ఒక హిందూ వ్యక్తిని సజీవంగా దహనం చేసి కొన ప్రాణం మీద ఉన్న ఆ హిందువును ఆ మత పిచ్చిగాన్లు (ముస్లింలు) కసి కొద్ది సుత్తితో కొట్టి చంపారు”  అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లింలు ఒక హిందువుని బహిరంగంగా సజీవంగా దహనం చేసి, కొన ప్రాణం మీద ఉన్న అతన్ని సుత్తితో కొట్టి చంపారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో మూక చేతిలో చంపబడ్డ వ్యక్తి ముస్లిం.ఈ వీడియో బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ నాయకుడు షాహిదుల్ ఇస్లాం హిరాన్ మృతదేహాన్ని ఓ విగ్రహానికి వేలాడదీసి దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నది. బంగ్లాదేశ్ మీడియా సంస్థల రిపోర్ట్స్ ప్రకారం, 05 ఆగస్ట్ 2024న బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి తరువాత, నిరసనకారులు పలువురు అవామీ లీగ్ నాయకులపై దాడి చేశారు. నైరుతి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్‌లోని జెనైదా నగరంలో  పోరాహతి యూనియన్‌ ఛైర్మన్‌, జెనైదా సదర్‌ ఉపాజిలా అవామీ లీగ్‌ జనరల్‌ సెక్రటరీ అయినా షాహిదుల్‌ ఇస్లాం హిరాన్‌పై ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారుల అతనిపై మూక దాడి చేసి, ఆయన ఇంటికి నిప్పు పెట్టారు, ఆ మంటల్లో చిక్కుకున్న హిరన్‌ మృతి చెందాడు. తరువాత హిరాన్ మృతదేహాన్ని బయటకు తీసి, జెనైదా నగరం మధ్యలో ఉన్న పైరా చత్తర్‌లో వేలాడదీసి, ఆయన మృతదేహం పై దాడి చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు

కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం మూక ఒక హిందువుని బహిరంగంగా కొట్టి చంపిన వీడియో అంటూ ఇదే సంఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న మరొక వీడియో వైరల్ కాగా దాన్ని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

ఈ వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన సమాచారం కోసం తగిన బెంగాలీ కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, బంగ్లాదేశ్ మీడియా సంస్థ  డైలీ స్టార్ 06 ఆగస్టు 2024న ప్రచురించిన వార్త కథనం ఒకటి లభించింది. ఈ  కథనం 05 ఆగస్టు 2024న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశాక రాజధాని నగరం ఢాకాతో పాటు ఢాకా బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా జరిగిన దాడులు మరియు ఘర్షణల గురించి రిపోర్ట్ చేసింది. ఈ కథనం ప్రకారం, 05 ఆగస్టు 2024న బంగ్లాదేశ్ ప్రధాని  షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారిని వార్తలు వచ్చిన వెంటనే, ఆందోళనకారులు అవామీ లీగ్ నాయకులు, వారి సహచరులపై మూక దాడులు చేస్తూ వారి ఆస్తులు, నివాసాలు, కార్యాలయాలను ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని  జెనైదా జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీర్ అబ్దుర్ రెహ్మాన్ తెలిపిన వివరాల ప్రకారం, “జెనైదాలో, పోరాహతి యూనియన్ ఛైర్మన్ షాహిదుల్ ఇస్లాం హిరాన్ మరియు అతని డ్రైవర్ అసద్‌ను ఆందోళనకారులు కొట్టి చంపారు. తరువాత, ఆయన మృతదేహాన్ని పైరా చత్తర్ వద్ద ఉన్న శిల్పం నుండి వేలాడదీశారు.” 

ఈ సమాచారం ఆధారంగా, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ  ఘటనను రిపోర్ట్ చేస్తూ పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ , ఇక్కడ , & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, షేక్ హసీనా రాజీనామా తరువాత, నిరసనకారులు పలువురు అవామీ లీగ్ నాయకులపై దాడి చేశారు. నైరుతి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్‌లోని జెనైదా పట్టణంలో పోరాహతి యూనియన్‌ ఛైర్మన్‌, జెనైదా సదర్‌ ఉపాజిలా అవామీ లీగ్‌ జనరల్‌ సెక్రటరీ అయినా షాహిదుల్‌ ఇస్లాం హిరాన్‌పై ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారుల అతని మూక దాడి చేసి, ఆయనను హత్య చేశారు.

05 ఆగస్టు 2024న జెనైదాలోని స్టేడియంపారాలోని హిరోన్ ఇంటిని ఒక ఆందోళనకారుల మూక ధ్వంసం చేసిందని, ఈ క్రమంలో హిరాన్ జనంపైకి కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారుల మూక అతడి ఇంటికి నిప్పుపెట్టింది. ఆ మంటల్లో మూడో అంతస్తులో చిక్కుకున్న హిరన్‌ మృతి చెందాడు. కోపోద్రిక్తులైన గుంపు అతని ఇంటిలోకి చొరబడి, అతని మృతదేహాన్ని బయటకు తీసి, నగరం మధ్యలో ఉన్న పైరా చత్తర్‌లో వేలాడదీసింది, అక్కడ ఆందోళనకారుల మూకలోని అనేక మంది సభ్యులు అతని మృతదేహంపై దాడి చేశారు. మేము పోరాహతి యూనియన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ను పరిశీలించగా, పోరాహతి యూనియన్ యొక్క ఛైర్మన్‌ షాహిదుల్ ఇస్లాం హిరాన్ అని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే, ఈ సంఘటనకు సంబంధించిన పలు వీడియోలు మాకు యూట్యూబ్‌లో లభించాయి (ఇక్కడ , ఇక్కడ). ఈ వీడియోలలో ఉన్న దృశ్యాలను మరియు వైరల్ వీడియోలోని  దృశ్యాలను పోల్చి చూస్తే. వైరల్ వీడియోలోని దృశ్యాలు బంగ్లాదేశ్‌లోని  జెనైదా జిల్లాలో అవామీ లీగ్ నాయకుడు షాహిదుల్ ఇస్లాం హిరాన్ ను చంపి మృతదేహాన్ని జెనైదా నగరం మధ్యలో ఉన్న పైరా చత్తర్‌లో వేలాడదీసిన సంఘటనకు సంబంధించినవి అని మనం నిర్ధారించవచ్చు. అలాగే మేము గూగుల్ మ్యాప్స్‌లో జెనైదా సిటీ సెంటర్‌లో హిరాన్ మృతదేహాన్ని వేలాడదీసిన పైరా చత్తర్‌ను జియోలొకేట్ చేశాము.  

అలాగే పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే  హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడఇక్కడఇక్కడ).

చివరగా, ఈ వీడియో బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ నాయకుడు షాహిదుల్ ఇస్లాం హిరాన్ ను చంపి ఆయన మృతదేహాన్ని ఓ విగ్రహానికి వేలాడదీసి దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నది.

Share.

About Author

Comments are closed.

scroll