‘పూర్తి జమ్మూకాశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా చూపిన పాకిస్థాన్ అఫిసియల్ వెబ్‌సైట్’ అని చెప్తూ, పాకిస్తాన్ ప్రభుత్వం వారి వెబ్ సైట్ యొక్క స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పూర్తి జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని తమ అధికారిక వెబ్ సైట్ లో ఒప్పుకున్న పాకిస్థాన్.
ఫాక్ట్ (నిజం): పాకిస్తాన్ ప్రభుత్వం తమ వెబ్ సైట్ లో బింగ్ మ్యాప్స్ కి (మైక్రోసాఫ్ట్ వాళ్ళది) సంబంధించిన కోవిడ్-19 ట్రాకర్ ని పెట్టారు. అది పాకిస్తాన్ ప్రభుత్వం తయారు చేసిన మ్యాప్ కాదు. ఎక్కడ నుండి సెర్చ్ చేస్తున్నారనే దాని ఆధారంగా వివిధ దేశాల బౌండరీలను బింగ్ మ్యాప్స్ చూపిస్తుంది. పూర్తి జమ్మూకాశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా పాకిస్థాన్ అధికారిక వెబ్‌సైట్ చూపించిందనే మాట వాస్తవమే, కానీ కేవలం భారత్ నుండి చూస్తేనే అలా కనిపిస్తుంది. వేరే దేశాల నుండి చూస్తే పూర్తి జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా కనిపించదు (వివాదాస్పద సరిహద్దుగా గ్రే డాష్ లతో ఉంటుంది). కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పాకిస్తాన్ ప్రభుత్వ వెబ్ సైట్ (http://covid.gov.pk/) లో చూస్తే, వారు బింగ్ మ్యాప్స్ కి సంబంధించిన కోవిడ్-19 ట్రాకర్ ని పెట్టినట్టు చూడవొచ్చు. అది పాకిస్తాన్ ప్రభుత్వం తయారు చేసిన మ్యాప్ కాదు. ఎక్కడ నుండి సెర్చ్ చేస్తున్నారనే దాని ఆధారంగా వివిధ వివాదాస్పద సరిహద్దులను గూగుల్ మ్యాప్స్ మరియు బింగ్ మ్యాప్స్ చూపిస్తాయి. ఇంతకముందు కూడా ఇలాంటి పోస్టులే గూగుల్ మ్యాప్స్ ఫోటోలతో వైరల్ అయినప్పుడు, FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు. పోస్టులో చెప్పినట్టు పాకిస్థాన్ అధికారిక వెబ్‌సైట్ లో పూర్తి జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా కనిపించిన మాట వాస్తవమే, కానీ కేవలం భారత్ నుండి చూస్తేనే అలా కనిపిస్తుంది. తమ వెబ్ సైట్ లో పెట్టిన బింగ్ మ్యాప్స్ ని ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం తీసేసింది. అయితే, ఆ మ్యాప్ ని బింగ్ వెబ్ సైట్ లో చూడవొచ్చు. (బింగ్ వెబ్ సైట్ లోని మ్యాప్ ని భారత్ నుండి చూస్తే, పూర్తి జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా కనిపిస్తుంది)
వేరే దేశాలలో ఆ మ్యాప్ ఎలా కనపడుతుందో చెక్ చేయమని వేరే దేశాల్లో నివసిస్తున్న కొంత మంది యూసర్లను FACTLY కోరింది. అమెరికా మరియు జర్మనీ నుండి వారు పంపిన స్క్రీన్ షాట్స్ ని చూడగా ఆ దేశాల్లో పూర్తి జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా కనిపించట్లేదని తెలుస్తుంది. జమ్మూకాశ్మీర్ వివాదాస్పద సరిహద్దుగా గ్రే డాష్ లతో ఉన్నట్టు చూడవొచ్చు. పాకిస్తాన్ వెబ్ సైట్ లో ఉన్నది బింగ్ మ్యాప్స్ కాబట్టి భారత్ నుండి చూసినప్పుడు మాత్రమే అలా కనిపించింది, అంతేకాని పూర్తి జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కాదు.
అంతేకాదు, పాకిస్తాన్ వెబ్ సైట్ లోని ఉన్న ఒక మ్యాప్ ఫోటో లో పూర్తి జమ్ముకాశ్మీర్ పాకిస్తాన్ అంతర్భాగంగా పెట్టినట్టు చూడవొచ్చు. అదే వెబ్ సైట్ లో గిల్గిత్ బాల్టిస్తాన్ కి సంబంధించిన కోవిడ్-19 కేసుల వివరాలు కూడా చూడవొచ్చు.
చివరగా, గూగుల్ మ్యాప్స్ లాగా కేవలం భారత్ నుండి చూసినప్పుడు మాత్రమే పాకిస్తాన్ వెబ్ సైట్ లో పూర్తి జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా చూడవొచ్చు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?