Fake News, Telugu
 

ముస్లిం వ్యక్తి కావడి యాత్ర లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్న 2017 ఘటన వీడియోని ఇప్పుడు జరిగినట్టు షేర్ చేస్తున్నారు

0

ఈ నెల 26వ తారీఖున ఒక ముస్లిం వ్యక్తి , కావడి యాత్రికులను తీసుకెళ్తున్న ట్రక్కు కింద కావాలని పడి మృతి చెందారు అని ఓ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.ఇందులో ఎంత నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం వ్యక్తి ఉద్దేశపూర్వకంగా 2022 కావడి యాత్ర ట్రక్కు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫాక్ట్ (నిజం): ఇది జూలై 2017లో జరిగిన సంఘటనకు సంబంధించిన పాత వీడియో, ఈ సంవత్సరం కావడి యాత్రలో జరిగిన సంఘటనగా తప్పుగా షేర్ చేస్తున్నారు. పోస్ట్ లో ఉన్న విషయంలో వాస్తవం ఉన్నా, ఇది 2017లో  జరిగిన సంఘటన, ఈ ఏడాదిది కాదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సంబంధిత కీ వర్డ్సతో ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటన 2017లో ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా దియోబంద్‌లో జరిగిందని తెలిసింది. ఈ ఘటనపై అప్పట్లో వివిధ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆ కథనాల ప్రకారం, వాహిద్ అనే వ్యక్తి కావడి యాత్రికులను తీసుకెళ్తున్న ట్రక్కు కింద పడి  అక్కడికక్కడే మరణించాడు. ఆ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. ఆ సమయంలో ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. లైవ్ హిందుస్థాన్ వారి కథనం ప్రకారం వాహిద్ తల్లిదండ్రులు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అతని అంత్యక్రియలు నిర్వహించడం గురించి మాట్లాడారు.

పాత వీడియో తిరిగి సోషల్ మీడియాలో ఇప్పుడు షేర్ అవుతుందని, సహరాన్‌పూర్ పోలీసులు దీని పైన స్పష్టతనిస్తూ ఇస్తూ ఒక ట్వీట్ చేసారు. ఈ సంఘటన 2017లో జరిగిందని, దీనిపై నిబంధనల ప్రకారం విచారణ కూడా అప్పుడు జరిగిందని, నిజానిజాలు తెలియకుండా ఇలాంటి వీడియోలను షేర్ చేయవద్దని సోషల్ మీడియా వినియోగదారులను అభ్యర్థించారు. ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ వారు కూడా తమ ట్వీట్ ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

చివరిగా, ఒక ముస్లిం వ్యక్తి కావడి యాత్ర ట్రక్కు కింద పడి ఆత్మహత్య చేసుకున్న 2017 ఘటన వీడియోని ఇప్పుడు జరిగినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll