Fake News, Telugu
 

‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత’ అనేది ఫేక్ న్యూస్

0

వివరణ (AUGUST 31, 2020):
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు (31 ఆగస్టు 2020) కన్ను మూసారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేసారు. క్రింద రాసిన ఆర్టికల్ గతంలో ప్రణబ్ ముఖర్జీ మరణం పై తప్పుడు సమాచారం ప్రచారం అయిన సమయంలో రాసినది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత.

ఫాక్ట్ (నిజం): మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత అని పెట్టిన పోస్టుల్లో నిజం లేదు. ప్రణబ్ ముఖర్జీ బ్రతికే ఉన్నారని, పుకార్లు నమ్మవద్దని తన కొడుకు మరియు కూతురు ట్విట్టర్ లో స్పష్టం చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి వెతకగా, జర్నలిస్ట్ రాజ్‍దీప్ సర్దేశాయ్ కూడా ప్రణబ్ ముఖర్జీ చనిపోయారని ట్వీట్ (ఇప్పుడు తీసేయబడింది) చేసాడని తెలుస్తుంది. అయితే, తరువాత ఇంకో ట్వీట్ లో తను ఫేక్ న్యూస్ నమ్మి తప్పుగా ట్వీట్ పెట్టినట్టు చెప్తూ క్షమాపణ అడిగాడు.

ఇంటర్నెట్ లో చాలా మంది ప్రణబ్ ముఖర్జీ చనిపోయారు అని పోస్ట్ చేస్తుండడంతో, ప్రణబ్ ముఖర్జీ బ్రతికే ఉన్నారని, పుకార్లు నమ్మవద్దని తన కొడుకు (అభిజిత్ ముఖర్జీ) మరియు కూతురు (షర్మిష్ట ముఖర్జీ) ట్విట్టర్ లో స్పష్టం చేసారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం స్థిరంగానే ఉందని, వైద్యానికి నెమ్మదిగా స్పందిస్తున్నారని ఇంకో ట్వీట్ లో అభిజిత్ ముఖర్జీ తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారు, తన ఆరోగ్య పరిస్థితి పై తాజా సమాచారం కోసం ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంకా బ్రతికే ఉన్నారు.

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.