Fake News, Telugu
 

ఇది 2015 లో తీసిన వీడియో. ఈ ఘటనలో చర్చి మరియు మసీదు యొక్క ప్రస్తావన రాలేదు

0

కర్ణాటక ఆలయం లో గౌర్నమెంట్ వారు హుండీ లోని ధనం తరలించబోగా, అక్కడి పురోహితులు ప్రజలు కలిపి చర్చి మసీద్ ల హుండీ లను కూడా తీసుకురండి అప్పుడే ఇది తీసుకెళ్లండి అని నిలిపివేయడం జరిగింది. మార్పు మొదలైంది.’ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియోలో చర్చి మరియు మసీదు యొక్క హుండీలు తెచ్చాకే గుడిలోని హుండీని ముట్టుకోమని అధికారులకు చెప్తున్న పురోహితులు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసినది 2015 లో తీసిన వీడియో. 2015లో కోలార్ (కర్ణాటక) కోలారమ్మ గుడిలో హుండీని పెట్టొచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, తమకు ప్రభుత్వం నుండి జీతాలు రావని, ప్రజలు హారతి ప్లేట్ లో ఇచ్చే డబ్బే తమకు దిక్కని, ఇప్పుడు హుండీ పెడితే తాము ఎలా జీవించాలని ఆ గుడి యొక్క ప్రధాన అర్చకుడు ప్రశ్నించాడు. పోస్ట్ లో చెప్పినట్టు చర్చి మరియు మసీదు యొక్క హుండీలు ప్రస్తావన ఈ సందర్భంలో రాలేదు. కావున పోస్ట్ లో చర్చి మరియు మసీదు గురించి మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని వీడియో గురించి వెతకగా, ఆ వీడియో 2015 లో తీసినది అని చెప్తూ ‘సురేష్’ అనే వ్యక్తి ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే వీడియోని 2015 లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. ‘సురేష్’ ట్వీట్ కింద తనే మరొక ట్వీట్ లో వీడియోలోని ఘటనకి సంబంధించిన ‘ప్రజా వాణి’ ఆర్టికల్ కూడా పెట్టాడు.

2015 లో కోలార్ (కర్ణాటక) కోలారమ్మ గుడిలో హుండీని పెట్టొచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, తమకు ప్రభుత్వం నుండి జీతాలు రావని, ప్రజలు హారతి ప్లేట్ లో ఇచ్చే డబ్బే తమకు దిక్కని, ఇప్పుడు హుండీ పెడితే తాము ఎలా జీవించాలని ఆ గుడి యొక్క ప్రధాన అర్చకుడు ప్రశ్నించాడని ‘ప్రజా వాణి’ ఆర్టికల్ లో చదవొచ్చు. పోస్ట్ లో చెప్పినట్టు చర్చి మరియు మసీదు యొక్క హుండీలు ప్రస్తావన ఈ సందర్భంలో రాలేదు.

ఆ రోజు గుడిలో జరిగిన ఘటన గురించి ఒకరు 2015 లో ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఫోటోలను ఇక్కడ చూడవొచ్చు. వీడియోలోని హుండీని ఆ ఫోటోల్లో చూడవచ్చు.

2015 లో గుడిలో హుండీని పెట్టొచ్చు అని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని ఇక్కడ చదవొచ్చు. 

చివరగా, చర్చి మరియు మసీదు యొక్క హుండీలు తెచ్చాకే గుడిలోని హుండీని ముట్టుకోమని పురోహితులు అనలేదు.

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll