Fake News, Telugu
 

గుల్బర్గలోని జామియా మసీదు ఫోటోను అయోధ్యలో కుల్చివేసిన బాబ్రీ మసీదు పూర్తి చిత్రం అని షేర్ చేస్తున్నారు

0

బాబ్రి మసీదు పూర్తి చిత్రం అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అయోధ్యలో కుల్చివేసిన బాబ్రీ మసీదు పూర్తి చిత్రం.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్నది గుల్బర్గ నగరంలోని జామియా మసీదు, అయోధ్యలో కుల్చివేసిన బాబ్రీ మసీదు కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును కర సేవకులు కుల్చివేసారు. ‘09 నవంబర్ 2019’ నాడు సుప్రీం కోర్ట్ కుల్చివేసిన బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణానికి అనుమతినిస్తూ తీర్పు ప్రకటించింది.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్  సెర్చ్ చేయగా, అదే ఫోటోని షేర్ చేస్తూ ‘Britannica’ వెబ్సైటు వారు, కాలబుర్గి నగరం గురించి వివరిస్తూ రాసిన ఒక ఆర్టికల్ దొరికింది. ఇప్పుడు గుల్బర్గ అని పిలుస్తున్న ఈ కాలబుర్గి నగరం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఫోటోలో కనిపిస్తున్నది గుల్బర్గ నగరంలోని జామియా మసీదు, అని ఆ ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా మరింత సమాచారం కోసం వెతకగా, పోస్టులోని అదే ఫోటో Alamy వెబ్సైటులో దొరికింది. ఈ వెబ్సైటులో కూడా పోస్టులోని  ఫోటో గుల్బర్గ నగరంలోని జామియా మసీదుకు సంబంధించినది అని తెలిపారు.

సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ‘5 August 2020’ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోది అయోధ్యలో రామ మందిర భూమి పూజ నిర్వహించారు. కుల్చివేసిన బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణాన్ని నిరసిస్తూ కొందరు ఇలా బాబ్రీ మసీదు చిత్రాలు అంటూ షేర్ చేస్తున్నారు.

పోస్టులోని ఈ ఫోటోతో సహా మరికొన్ని ఫోటోలను బాబ్రీ మసీదు చిత్రాలు అని షేర్ చేసినప్పుడు, Factly రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ను ఇక్కడ చూడవచ్చు.

చివరగా, గుల్బర్గలోని జామియా మసీదుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ అయోధ్యలో కుల్చివేసిన బాబ్రీ మసీదు పూర్తి చిత్రం అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll