కాంచీపురంలో ఒక ముస్లిం వ్యక్తి 800 సంవత్సరాల క్రితం నాటి శివాలయాన్ని ఆక్రమించి, కనపడకుండా నలవైపులా మూసేసి, పంక్చర్ దుకాణం పెట్టాడని చెప్తూ, ఒక వీడియోతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాంచీపురంలో ఒక ముస్లిం వ్యక్తి 800 సంవత్సరాల క్రితం నాటి శివాలయాన్ని ఆక్రమించి, పంక్చర్ దుకాణం పెట్టాడు.
ఫాక్ట్: వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు జే.ఎస్.కే. గోపి. తను ఎక్కడా కూడా దేవాలయాన్ని ఆక్రమించి, పంక్చర్ దుకాణం పెట్టిన వారు ముస్లిం మతస్తులు అని చెప్పలేదు. ఆ ఆలయం గురించి వివిధ వార్తాసంస్థలు కూడా ఆర్టికల్స్ ప్రచురించాయి. అయితే, వారు కూడా పంక్చర్ దుకాణం ముస్లిం వ్యక్తికి సంబంధించింది అని రాయలేదు. అంతేకాదు, దుకాణంలో వివిధ హిందూ దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నట్టు చూడవచ్చు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియోని జే.ఎస్.కే. గోపి తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చెసినట్టు తెలిసింది. ఆ వీడియోలో మాట్లాడుతుంది కూడా తనే. ఆ ఆలయానికి సంబంధించి తను వివిధ ట్వీట్లు చేసాడు. అయితే, తను ఎక్కడా కూడా దేవాలయాన్ని ఆక్రమించి, పంక్చర్ దుకాణం పెట్టిన వారు ముస్లిం మతస్తులు అని చెప్పలేదు.
వీడియో వైరల్ అయ్యాక ఆ ఆలయం గురించి వివిధ వార్తాసంస్థలు కూడా ఆర్టికల్స్ ప్రచురించాయి. అయితే, వారు కూడా పంక్చర్ దుకాణం ముస్లిం వ్యక్తికి సంబంధించింది అని రాయలేదు.
తమిళనాడు హిందూ ధార్మిక వ్యవహారాల మంత్రి పీ.కే శేఖర్ బాబు కూడా ఆ స్థలాన్ని సందర్శించారు. ఆ సందర్భంలో వారు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
అంతేకాదు, ఆ పంక్చర్ దుకాణంలో వివిధ హిందూ దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నట్టు చూడవచ్చు. ఆ స్థలానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, కాంచీపురంలో ఒక ముస్లిం వ్యక్తి శివాలయాన్ని ఆక్రమించి, పంక్చర్ దుకాణం పెట్టాడని తప్పుగా షేర్ చేస్తున్నారు.