“ఇప్పుడు మీరు చెవి ఫోన్ లేకుండా కూడా వరల్డ్ వైడ్ రేడియో వినవచ్చు !! ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సైట్!! మీరు లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, భూగోళం తిరగడాన్ని మీరు చూడవచ్చు. మీరు తాకిన ఆకుపచ్చ చుక్కలు ఉన్నాయి, మీరు ఆ ప్రదేశం నుండి ప్రత్యక్ష రేడియో వినడం ప్రారంభించవచ్చు.” అని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇస్రో ఎక్కడి నుంచైనా ఏ దేశ ప్రత్యక్ష రేడియో అయినా వినడానికి ఒక పోర్టల్ (రేడియో గార్డెన్) ను అభివృద్ది చేసింది.
ఫాక్ట్: రేడియో గార్డెన్ అనే పోర్టల్ ట్రాన్స్ నేషనల్ రేడియో ఎన్ కౌంటర్స్ (టిఆర్ఈ) వారి రీసెర్చ్ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు కాబడ్డది. టిఆర్ఈ అనేది ‘నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సౌండ్ అండ్ విజన్’ వారి ప్రాజెక్ట్. ఒక ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ గా 2016లో స్టూడియో పుకీ మరియు మోనికర్ దీనిని రూపొందించి అభివృద్ది చేశారు. కొన్ని న్యూస్ ఏజెన్సీలు దీన్ని రిపోర్ట్ కూడా చేసాయి. రేడియో గార్డెన్ అనేక రేడియో స్టేషన్లను ప్రత్యక్షంగా వినడానికి వీలు కల్పిస్తుంది, కానీ ఇస్రోకు దీనితో సంబంధం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
రేడియో గార్డెన్ పోర్టల్ లో ఉన్న సమాచారం ప్రకారం, ఈ పోర్టల్ నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ కేంద్రంగా ఉంది. ఇది ట్రాన్స్ నేషనల్ రేడియో ఎన్ కౌంటర్స్ (టిఆర్ఈ) వారి రీసెర్చ్ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు కాబడ్డది. టిఆర్ఈ అనేది నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సౌండ్ అండ్ విజన్ వారి ఒక ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ గా 2016 లో స్టూడియో పుకీ మరియు మోనికర్ దీనిని రూపొందించి అభివృద్ది చేశారు. రేడియో గార్డెన్ వివిధ దేశాల నుండి అనేక రేడియో స్టేషన్లను ప్రత్యక్షంగా వినడానికి వీలు కల్పిస్తుంది అనేది నిజమే అయినప్పటికీ, ఇస్రోకు దీనితో సంబంధం లేదు.
పోర్టల్ నుండి ఒక క్లూ తీసుకొని, నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సౌండ్ అండ్ విజన్ పై సెర్చ్ చేసినప్పుడు రేడియో గార్డెన్ కు సంబంధించిన మరింత సమాచారం దొరికింది. ఈ సమాచారం ప్రకారం, రేడియో గార్డెన్ ఒక ఇంటరాక్టివ్ వెబ్ సైట్ అని, ఇది ట్రాన్స్ నేషనల్ రేడియో ఎన్ కౌంటర్స్ (టిఆర్ఈ) యొక్క ప్రాజెక్టులలో ఒకటి అని, ఇది సంస్కృతి మరియు ఐడెంటిటీపై రేడియో ప్రభావంపై ఒక పరిశోధన ప్రాజెక్ట్ అని తెలిసింది. ఇంకా, ట్రాన్స్ నేషనల్ రేడియో ఎన్ కౌంటర్స్ (టిఆర్ఈ) ప్రాజెక్ట్ కు హేరా జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా మద్దతు ఇస్తుందని పేర్కొనబడింది. ఈ సమాచారంలో ఇస్రో పై ఎలాంటి ప్రస్తావన లేదు.
సంబంధిత కీ వర్డ్స్ తో తదుపరి గూగుల్ సెర్చ్ ద్వారా రేడియో గార్డెన్ గురించి అనేక న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించాయి. ది గార్డియన్ యొక్క ఒక వ్యాసం ప్రకారం, రేడియో గార్డెన్ 2016 లో జోనాథన్ పుకీ చే ప్రారంభించబదిందని, వివిధ దేశాల మధ్య, ఆయా ప్రజల కలయికలో రేడియో ఎలాంటి పాత్ర పోషించింది అనే పరిశోధనలో భాగంగా నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సౌండ్ అండ్ విజన్ చే తాత్కాలిక ప్రాజెక్ట్ గా దీన్ని రూపొందించారు.
ఎన్ పిఆర్ యొక్క మరొక ఆర్టికల్ ద్వారా జోనాథన్ పుకీ, రేడియో గార్డెన్ కోసం నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌండ్ అండ్ విజన్ వారి ప్రజా ధనంతో నిధులు సమకూరాయని పేర్కొన్నాడు. అలాగే, రేడియో గార్డెన్ ను ఇస్రోకు ఆపాదించే వార్తా కథనాలు లేదా ఇతర సమాచారం ఈ ఆర్టికల్ లో లేవు.
ఇంకా, 2017 లో ఇదే వార్త వైరల్ అయినప్పుడు, రేడియో గార్డెన్ వివిధ దేశాల నుండి అనేక రేడియో స్టేషన్లను ప్రత్యక్షంగా వినడానికి వీలు కల్పిస్తుందని, కానీ ఇస్రోకు దానితో సంబంధం లేదని ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తమ ఆర్టికల్ ద్వారా తెలిపింది.
చివరగా, రేడియో గార్డెన్ అనేక రేడియో స్టేషన్లను ప్రత్యక్షంగా వినడానికి వీలు కల్పిస్తుంది, కానీ ఇస్రోకు దీనితో సంబంధం లేదు.