Fake News, Telugu
 

ఇండోనేషియా హిందూ దేవాలయంలోని విగ్రహాన్ని టర్కిష్- సిరియా సరిహద్దు తవ్వకాలలో బయటపడినట్టు షేర్ చేస్తున్నారు

0

దక్షిణ టర్కిష్- సిరియా సరిహద్దులో టిగ్రిస్-యూఫ్రేట్స్ (మెసొపొటేమియా) లోని తవ్వకాలలో 3,200 సంవత్సరాల నాటి నరసింహస్వామి విగ్రహం బయటపడింది, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 3,200 సంవత్సరాల నాటి నరసింహస్వామి విగ్రహం దక్షిణ టర్కిష్- సిరియా సరిహద్దు తవ్వకాలలో బయటబడింది.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్న విగ్రహం, ఇండోనేషియా కుటా బీచ్ సమీపంలో ఉన్న ‘Pura Dalem & Pura Penataran Desa Adat Kuta’ హిందూ దేవాలయంలో నిర్మించబడినది. ఈ విగ్రహం దక్షిణ టర్కిష్- సిరియా సరిహద్దు తోవ్వకలలో బయటపడినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే విగ్రహం యొక్క ఫోటోని ‘VIRTOURIST.com’ అనే టూరిస్ట్ వెబ్సైటులో ఒక యాత్రికుడు షేర్ చేసినట్టు తెలిసింది. ఇండోనేషియా బాలి ద్వీపంలో ఉన్న ఒక హిందూ దేవాలయంలో ఈ విగ్రహం నిర్మించబడినట్టు వెబ్సైటులో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా బాలిలో ఆ విగ్రహం ఉన్న హిందూ దేవాలయం కోసం వెతికితే, ఈ విగ్రహం బాలిలోని కుటా బీచ్ సమీపంలో ఉన్న ‘Pura Dalem & Pura Penataran Desa Adat Kuta’ హిందూ దేవాలయంలో నిర్మించినట్టు తెలిసింది. పోస్టులో షేర్ చేసిన అదే విగ్రహం, ‘Pura Dalem & Pura Penataran Desa Adat Kuta’ గూగుల్ మాప్స్ ఫోటోలలో కనిపించింది. దీన్ని బట్టి, ఫోటోలో కనిపిస్తున్న విగ్రహం ఇండోనేషియా లోని హిందూ దేవాలయంలో నిర్మించినది అని, ఈ విగ్రహం దక్షిణ టర్కిష్- సిరియా సరిహద్దు తవ్వకాలలో బయటపడినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఇండోనేషియా హిందూ దేవాలయంలో నిర్మించిన విగ్రహాన్ని చూపిస్తూ దక్షిణ టర్కిష్- సిరియా సరిహద్దు తవ్వకాలలో బయటపడిన 3,200 సంవత్సరాల నాటి నరసింహస్వామి విగ్రహం అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll