Fake News, Telugu
 

భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అమెరికా హానర్ కార్డన్‌తో స్వాగతించడం అరుదుగా లభించే గౌరవమేమి కాదు

0

అమెరికా డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ జె ఆస్టిన్ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను హానర్ కార్డన్‌తో (గౌరవ భద్రత వలయం) పెంటగాన్ లోనికి ఆహ్వానించిన అరుదైన దృశ్యాలు, అంటూ ఒక వీడియో మరియు కొన్ని ఫోటోలను జత చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఒక విదేశాంగ మంత్రికి ఇలాంటి గౌరవం చాలా అరుదుగా ఇస్తారని, బీజేపీ ప్రభుత్వంలో భారత దేశానికి లభిస్తున్న విశిష్ట గౌరవానికి ఇది ప్రతీక అని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒక విదేశాంగ మంత్రిని అమెరికా హానర్ కార్డన్‌తో గౌరవించడం చాలా అరుదుగా జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వంలో జైశంకర్‌కు మాత్రమే ఈ గౌరవం లభించింది.

ఫాక్ట్ (నిజం): అమెరికా డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ జె ఆస్టిన్ III భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను హానర్ కార్డన్‌తో గౌరవించిన మాట వాస్తవమే. కానీ, జైశంకర్‌కు ముందు చాలా మంది విదేశాంగ మంత్రులను అమెరికా హానర్ కార్డన్‌ గౌరవంతో స్వాగతించింది. 2018లో రిపబ్లిక్ ఆఫ్ ఐస్ ల్యాండ్ విదేశాంగ మంత్రి గుడ్లౌఘర్ థోర్ థర్డార్సన్‌ను, ఇండోనేషియా విదేశాంగ మంత్రి రేట్నో మర్సుడిని కూడా అమెరికా హానర్ కార్డన్‌తో గౌరవించింది. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న ఏకే ఆంటోనిని కూడా అమెరికా గార్డ్ ఆఫ్ హానర్స్‌తో గౌరవించింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అమెరికా డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ జె ఆస్టిన్ III ఇటీవల హానర్ కార్డన్‌తో పెంటగాన్ లోనికి స్వాగతించిన వీడియోలు మరియు ఫోటోలు లభించాయి. ఈ ఫోటోలని జైశంకర్‌ తన అధికార ట్విటర్ హాండిల్‌లో కూడా షేర్ చేశారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అమెరికా హానర్ కార్డన్‌తో గౌరవించిన విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశాయి.

కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు అమెరికా ఇతర దేశ విదేశాంగ మంత్రులను హానర్ కార్డన్‌తో గౌరవించడం అరుదేమి కాదు. 2018లో రిపబ్లిక్ ఆఫ్ ఐస్ ల్యాండ్ విదేశాంగ మంత్రి గుడ్లౌఘర్ థోర్ థర్డార్సన్‌ను, ఇండోనేషియా విదేశాంగ మంత్రి రేట్నో మర్సుడిని కూడా అమెరికా హానర్ కార్డన్‌తో గౌరవించింది. వాటికి సంబంధించి ఆమెరకా డిఫెన్స్ సెక్రెటరీ పబ్లిష్ చేసిన ప్రకటనలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 2022 ఫిబ్రవరి నెలలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబాను కూడా అమెరికా డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ జె ఆస్టిన్ హానర్ కార్డన్‌తో స్వాగతించారు.

అంతేకాదు, 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న ఏకే ఆంటోనిని కూడా అమెరికా గార్డ్ ఆఫ్ హానర్స్‌తో గౌరవించింది. అమెరికా ఏకే ఆంటోనిని గౌరవ గార్డ్ హానర్స్‌తో స్వాగతించిన ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అమెరికా హానర్ కార్డన్‌తో స్వాగతించడం చాలా అరుదుగా ఇచ్చే గౌరవమేమి కాదు. 

Share.

About Author

Comments are closed.

scroll