72 ఏళ్ల భారత ఆర్ధిక వ్యవస్థ చరిత్రలో మొదటిసారిగా పాకిస్థాన్ కంటే భారత్ జీడీపీ వృద్ధి రేటు తగ్గింది అని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియా సైట్లలో ప్రచారం కాబడుతుంది. ఈ క్లెయిమ్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : మోదీ ప్రభుత్వంలో భారత్ యొక్క జీడీపీ వృద్ధి రేటు పాకిస్తాన్ జీడీపీ వృద్ధి రేటు కంటే తగ్గడం గత 72 సంవత్సరాలలో ఇదే మొదటిసారి.
ఫాక్ట్ (నిజం): గత 72 సంవత్సరాలలో భారత్ యొక్క వార్షిక జీడీపీ వృద్ధి రేటు పాకిస్తాన్ యొక్క వార్షిక జీడీపీ వృద్ధి రేటు కంటే తక్కువగా చాలా సార్లు ఉంది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
భారత్ మరియు పాకిస్థాన్ యొక్క వార్షిక జీడీపీ వృద్ధి రేట్లకి (1961-2018 సంవత్సరాల మధ్య) సంబంధించిన డేటా వరల్డ్ బ్యాంకు వెబ్సైట్లో లభించింది. ఈ డేటాను పోల్చి చూడగా, పాకిస్తాన్ యొక్క వార్షిక జీడీపీ వృద్ధి రేటు గతంలో చాలా సార్లు భారత్ యొక్క వార్షిక జీడీపీ వృద్ధి రేటుని అధిగమించింది అని తెలుస్తుంది. కింద చూపించిన గ్రాఫ్ లో, పాకిస్తాన్ యొక్క వృద్ధి రేటు 1960, 1970, 1980 లలో మరియు 1990 లలో భారత్ యొక్క వృద్ధి రేటు ని అధిగమించిందని చూడవచ్చు. చివరిసారి పాకిస్తాన్ యొక్క వృద్ధి రేటు 2000వ సంవత్సరంలో భరత్ వృద్ధి రేట్ ని అధిగమించింది.
అంతేకాక, పోస్ట్ లో భారత్ మరియు పాకిస్తాన్ యొక్క జీడీపీ వృద్ధి రేట్లు సరిగ్గా పోల్చలేదు. 2019-20 Q1 (Quarter-1) యొక్క భారత్ జీడీపీ వృద్ధి రేట్ ని (5%) ఏదో ఇష్టం వచ్చిన సంఖ్య తో పోల్చారు. ఎందుకంటే గత సంవత్సరం (2018-19) పాకిస్తాన్ యొక్క వార్షిక జీడీపీ వృద్ధి రేటు కేవలం 3.3%, మరియు పాకిస్తాన్ యొక్క Q1 2019-20 వృద్ధి రేటు ఎక్కడ లభించలేదు.
చివరగా, గత 72 సంవత్సరాలలో భారత్ యొక్క జీడీపీ వృద్ధి రేటు పాకిస్తాన్ యొక్క జీడీపీ వృద్ధి రేటు కంటే చాలా సార్లు తగ్గింది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?