‘ఈటీవీ’ న్యూస్ ఛానల్ వారు తమ సెప్టెంబర్ 17 ఉదయం 7 గంటల వార్తా ప్రసారంలో చంద్రబాబు నాయుడుని ఆంధ్ర ప్రదేశ్ ‘ముఖ్యమంత్రి’ గా పేర్కొంటూ స్లయిడ్ వేశారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. వాటిలో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.
క్లెయిమ్ : ‘ఈటీవీ’ న్యూస్ ఛానల్ తమ సెప్టెంబర్ 17 ఉదయం 7 గంటల వార్తా ప్రసారంలో చంద్రబాబు నాయుడుని ఆంధ్ర ప్రదేశ్ ‘ముఖ్యమంత్రి’ గా పేర్కొంటూ స్లయిడ్ వేశారు.
ఫాక్ట్ (నిజం): ‘ఈటీవీ’ న్యూస్ ఛానల్ వారు సెప్టెంబర్ 17 ఉదయం 7 గంటల వార్తా ప్రసారంలో చంద్రబాబు నాయుడుని ఆంధ్ర ప్రదేశ్ ‘ముఖ్యమంత్రి’ గా పేర్కొంటూ స్లయిడ్ వేయలేదు. పోస్టు లో పెట్టిన ఫోటో ఒక ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.
పోస్టులో చెప్పినట్లుగా ‘ఈటీవీ’ న్యూస్ ఛానల్ వారి తమ సెప్టెంబర్ 17 ఉదయం 7 గంటల వార్తా ప్రసారం చూసినప్పుడు, పోస్టులో పెట్టిన ఫోటోలో ఉన్న పరిసరాలను ఆ న్యూస్ వీడియోలో 5:15 నుండి 6:05 వరకు కనిపిస్తాయి. ఆ సమయంలో, అసలు చంద్రబాబుకి సంబంధించి ఎటువంటి స్లయిడ్ కూడా వేయనట్లుగా చూడవచ్చు. అంతే కాకుండా ఆ న్యూస్ వీడియో లో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుని ఆంధ్ర ప్రదేశ్ ‘ముఖ్యమంత్రి’ గా పేర్కొంటూ స్లయిడ్ వేసినట్లుగా కనిపించలేదు.
చివరగా, ఈటీవీ’ న్యూస్ ఛానల్ వారు తమ వార్తా ప్రసారంలో చంద్రబాబు నాయుడుని ఆంధ్ర ప్రదేశ్ ‘ముఖ్యమంత్రి’ గా పేర్కొంటూ స్లయిడ్ వేయలేదు. అలా ఉన్న ఫోటో ఒక ఫోటోషాప్ చేయబడిన ఫోటో.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?