Fake News, Telugu
 

వినాయక నినాదాలు చేసినందుకు కాదు, తాగి తమతో తప్పుగా ప్రవర్తించినందుకు లంగర్ హౌస్ పోలీసులు చేయి చేసుకున్నారు, కేసు పెట్టారు

1

పోలీసులు కొందరిని కొడుతున్న వీడియోని పెట్టి, వినాయకుని నినాదాలు చేసినందుకు భక్తులను కొడుతున్న లంగర్ హౌస్ పోలీసులు అంటూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : వినాయకుని నినాదాలు చేసినందుకు భక్తులను కొడుతున్న లంగర్ హౌస్ పోలీసులు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని వ్యక్తులను పోలీసులు కొట్టింది తాగి తమతో తప్పుగా ప్రవర్తించినందుకు, వినాయకుని నినాదాలు చేసినందుకు కాదు. అంతే కాదు, నలుగురి పై కేసు కూడా పెట్టినట్టు లంగర్ హౌస్ పోలీసు వారు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లో చెప్పిన విషయం పై వివరణ కోసం లంగర్ హౌస్ పోలీసు వారికి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, గణేష్ ఉరేగింపుతో వచ్చిన కొందరు వ్యక్తులు ఇంద్రా రెడ్డి ఫ్లైఓవర్ దగ్గర మద్యం సేవించారని, పబ్లిక్ ప్లేస్ లో తాగవద్దని చెప్పిన కానిస్టేబుల్ తో తప్పుగా ప్రవర్తించారని తెలిసింది. ఇతర పోలీసు సిబ్బంది వచ్చాక కూడా తాము రిపోర్టర్లమని చెప్తూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో నలుగురి పై కేసులు కూడా పెట్టామని పోలీసువారు తెలిపారు. ఈ విషయం పై పూర్తి వివరాలు ఇస్తూ లంగర్ హౌస్ పోలీసు ఎస్.హెచ్.ఓ ట్వీట్ చేసినట్టు కూడా చూడొచ్చు. 

ఈ విషయం పై సెప్టెంబర్ 16న సాక్షి వార్తాపత్రిక లో వచ్చిన ఆర్టికల్ ని కూడా లంగర్ హౌస్ ఎస్.హెచ్.ఓ ట్వీట్ చేసాడు

చివరగా, వినాయకుని నినాదాలు చేసినందుకు కాదు, తాగి తమతో తప్పుగా ప్రవర్తించినందుకు లంగర్ హౌస్ పోలీసులు చేయి చేసుకున్నారు, ఆ తరవాత కేసు పెట్టారు

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll