Fake News, Telugu
 

ఇండియా గేటు పై భారత దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించి మరణించిన వ్యక్తుల పేర్లు రాయలేదు

0

ఇండియా గేట్ పై 95,300 మంది స్వాతంత్ర సమర యోధుల పేర్లు రాసి ఉంటే, వాటిలో 61,945 ముస్లిం మతస్తుల పేర్లు ఉన్నాయంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. భారత స్వాతంత్రం ముస్లింల రక్తంతో రాయబడిందని, ముస్లింల జనాభా శాతం కన్నా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి శాతం చాల ఎక్కువని ఈ పోస్టులో చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇండియా గేటు పై 95,300 మంది స్వాతంత్ర సమర యోధుల పేర్లు రాసి ఉంటే, వాటిలో 61,945 ముస్లింల పేర్లు కలిగి ఉన్నాయి.

ఫాక్ట్ (నిజం): మొదటి ప్రపంచ యుద్దంలో మరణించిన భారత దేశ సైనికుల జ్ఞాపకార్ధం ఇండియా గేటు నిర్మించారు. 1919లో జరిగిన ఆఫ్గనిస్తాన్ యుద్ధంలో చనిపోయిన బ్రిటిష్ మరియు భారత సైనికుల పేర్లని ఈ మెమోరియల్ పై రాసారు. భారత దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించి మరణించిన వ్యక్తుల పేర్లు ఇండియా గేటు పై రాయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, ఇండియా గేట్ విశిష్టతను వివరిస్తూ ‘Delhi Tourism’ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్ తరుపున యుద్ధం చేసి చనిపోయిన 70,000 భారత సైనికుల జ్ఞాపకార్ధంగా ఇండియా గేటు ని నిర్మించినట్టు ఆర్టికల్ లో తెలిపారు. 1919 లో జరిగిన మూడవ ఆఫ్ఘాన్ యుద్దంలో మరణించిన 13,516 మంది బ్రిటిష్ మరియు భారత సైనికుల పేర్లని ఈ మెమోరియల్ పై రాసినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఇండియా గేట్ రాసి ఉన్న పేర్లు భారతదేశ స్వాతంత్రం కోసం పాటుపడి మరణించిన వ్యక్తుల పేర్లు కాదని తెలుస్తుంది.

ఇండియా గేట్ పై రాసి ఉన్న సైనికుల పేర్ల సమాచారం కోసం వెతకగా, ఈ డేటాబేసు ‘Commonwealth War Graves Commission (CWGC)’ వెబ్సైటులో ఉన్నట్టు తెలిసింది. ఈ డేటాబేసు లో సైనికుల పేర్లు, ర్యాంక్, సర్వీస్ నెంబర్, రెజిమెంట్, మరణించిన తేదిలని తెలిపారు. ఇందులో సైనికుల యొక్క మతాలని ఎక్కడ తెలుపలేదు.

తమ వెబ్సైటులో తెలిపిన సైనికుల పేర్లని మిలిటరీ ర్యాంక్ లేదా మతపరమైన వివక్షలు చూపుతూ రాయలేదని CWGC వెబ్సైటులోని ‘About’ సెక్షన్ లో తెలిపింది. ఈ వివరాల ఆధారంగా ఇండియా గేట్ పై రాసి ఉన్నది భారత దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించి మరణించిన వ్యక్తుల పేర్లు కాదని చెప్పవచ్చు.

చివరగా, ఇండియా గేటు పై భారత దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించి మరణించిన వ్యక్తుల పేర్లు రాయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll