Fake News, Telugu
 

18 నుండి 65 సంవత్సరాల మధ్యనున్న వారంతా యువకులని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు

0

18 నుండి 65 సంవత్సరాల మధ్యనున్న వారంతా యువకులని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 18 నుండి 65 సంవత్సరాల మధ్యనున్న వారంతా యువకులని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.

ఫాక్ట్: 18 నుండి 65 సంవత్సరాల మధ్యనున్న వారంతా యువకులని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఐక్యరాజ్యసమితి వివిధ సందర్భాల్లో 60 కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నవారిని “వృద్ధులు”గా పరిగణించింది. డికేడ్ ఆఫ్ హెల్తీ ఏజింగ్ 2021 నుండి 2030 వరకు జరుపుకుంటారని యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అలా ప్రకటించిందని చెప్పడానికి ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెబ్సైటులో కీ-వర్డ్స్ తో వెతకగా, అలా WHO ప్రకటించిందని చెప్పడానికి ఆధారాలు దొరకలేదు.

అడ్వాన్సెస్ ఇన్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ జర్నల్‌లోని ఆర్టికల్ ప్రకారం 2015లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా వయస్సు ప్రమాణాలను సవరించింది. 44 ఏళ్లలోపు ఉన్న వ్యక్తి యువకుడిగా పరిగణించబడతాడని తెలిపారు. కొత్త వయస్సు వర్గీకరణ ప్రకారం, చిన్న వయస్సు 25 నుండి 44 వరకు, మధ్య వయస్సు 44-60, వృద్ధాప్య వయస్సు 60-75 అని ఉంది.

UN యొక్క ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం, 15 మరియు 24 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులను “యువత”గా పరిగనిస్తుంది. UN యొక్క హై కమీషనర్ ఫర్ రేఫ్యుజీస్, 60 ఏళ్లు పైబడిన వారిని “వృద్ధులు”గా పరిగనిస్తారు. ఐక్యరాజ్యసమితి వివిధ సందర్భాల్లో 60 కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నవారిని “వృద్ధులు”గా పరిగణించింది.

డికేడ్ ఆఫ్ హెల్తీ ఏజింగ్ 2021 నుండి 2030 వరకు జరుపుకుంటారని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది.

చివరగా, 18 నుండి 65 సంవత్సరాల మధ్యనున్న వారంతా యువకులని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll