Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియోలో కత్తిసాము చేస్తున్నది రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియా కుమారి కాదు, గుజరాత్‌కి చెందిన నికితాబా రాథోడ్.

0

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి కత్తి సాము చేశారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి కత్తి సాము చేస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియోలో కత్తిసాము చేస్తున్నది రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి కాదు, గుజరాత్‌కి చెందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్, కత్తిసాము శిక్షకురాలు నికితాబా రాథోడ్. ఇదే వీడియోను నికితాబా రాథోడ్ 22 జనవరి 2024న తన ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో షేర్ చేసిన వీడియోలోని స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘నికితాబా రాథోడ్’ అనే మహిళ తన ఫేస్‌బుక్ పేజీలో 22 జనవరి 2024న పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆమె  ఫేస్‌బుక్ లో తాను గుజరాత్‌కి చెందిన డిజిటల్ క్రియేటర్, బ్యూటీషియన్ అని పేర్కొన్నారు. అలాగే ఆమె ఈ వేడుకకు సంబంధించిన మరొక వీడియోని షేర్ చేసారు, వైరల్ వీడియో మరియు ఈ వీడియోలో ఆమె ధరించింది పింక్ రంగు చీరనే అని గమనించవచ్చు .

నికితాబా రాథోడ్ ఇదే వీడియోని తన యూట్యూబ్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేసింది. అలాగే మేము తన సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా ఆమె కత్తిసాము చేసిన మరిన్ని వీడియోలు లభించాయి.అంతే కాకుండా కొన్ని వీడియోలలో ఆమె కత్తిసాము శిక్షకురాలు అని పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు). దీన్ని బట్టి వైరల్ వీడియోలో కనిపిస్తున్నది నికితాబా రాథోడ్ అని నిర్థారించవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్నది రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియా కుమారి కాదు, గుజరాత్‌కి చెందిన నికితాబా రాథోడ్.

Share.

About Author

Comments are closed.

scroll