Fake News, Telugu
 

భారత రాష్ట్రపతి కుమార్తెను భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ నుండి గ్రౌండ్ డ్యూటీకి 2017లోనే మార్చారు

0

ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న భారత రాష్ట్రపతి కుమార్తెను భద్రతా కారణాల దృష్ట్యా అంతర్గత వ్యవహారాలకు టాటా అధికారులు ఇటీవల బదిలీ చేశారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భద్రతా కారణాల దృష్ట్యా టాటా అధికారులు ఇటీవల రాష్ట్రపతి కుమార్తెను ఎయిర్ ఇండియాలో అంతర్గత వ్యవహారాలకు బదిలీ చేశారు.

ఫాక్ట్: భారత రాష్ట్రపతి కుమార్తె, శ్రీమతి స్వాతి కోవింద్ ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూగా పనిచేసారు. భద్రతా కారణాల దృష్ట్యా 2017లోనే ఎయిర్ ఇండియా ఇంటిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో డిప్యూట్ చేయబడే ముందు ఆమె బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాల్లో పనిచేసింది. టాటా గ్రూప్ భారత ప్రభుత్వం నుండి ఎయిర్ ఇండియా కొనుగోలును పూర్తి చేసి, జనవరి 2022లో ఎయిర్‌లైన్ నిర్వహణ మరియు నియంత్రణను స్వాధీనం చేసుకుంది. కాబట్టి, టాటా అధికారులు 2017లోనే రాష్ట్రపతి కుమార్తెను భద్రతా కారణాల దృష్ట్యా బదిలీ చేయడం సాధ్యంకాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుమార్తె గురించి గూగుల్‌లో వెతకగా, భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రపతి కుమార్తెను ఎయిర్ ఇండియాలో గ్రౌండ్ డ్యూటీకి తరలించినట్లు 2017లోనే రిపోర్ట్ చేసిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి.

భారత రాష్ట్రపతి కుమార్తె, శ్రీమతి స్వాతి కోవింద్ ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూగా పనిచేసారు. భద్రతా కారణాల దృష్ట్యా 2017లో ఎయిర్ ఇండియా ఇంటిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో డిప్యూట్ చేయబడే ముందు ఆమె బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాల్లో పనిచేసింది.

టాటా గ్రూప్ భారత ప్రభుత్వం నుండి ఎయిర్ ఇండియా కొనుగోలును జనవరి 2022లో పూర్తి చేసి, ఎయిర్‌లైన్ నిర్వహణ మరియు నియంత్రణను స్వాధీనం చేసుకుంది. కాబట్టి, టాటా అధికారులు 2017లోనే అధ్యక్షుడి కుమార్తెను భద్రతా కారణాల దృష్ట్యా బదిలీ చేయడం సాధ్యంకాదు.

చివరగా, భారత రాష్ట్రపతి కుమార్తెను భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ నుండి గ్రౌండ్ డ్యూటీకి 2017లోనే మార్చారు.

Share.

About Author

Comments are closed.

scroll