అమెరికాలో ‘Howdy Modi’ ఈవెంట్ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో మోడీ మరియు ట్రంప్ యొక్క పోస్టర్లను పెట్టినట్టు ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్ : న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ లో మోడీ మరియు ట్రంప్ యొక్క‘Howdy Modi’ పోస్టర్లు.
ఫాక్ట్ (నిజం): అది ఒక ఎడిటెడ్ ఫోటో. ఒరిజినల్ ఫోటోలో ‘Howdy Modi’ పోస్టర్లు లేవు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోలాంటి ఇంకో ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న కార్లు మరియు మనుషులే ఆ ఫోటో లో కూడా ఉంటారు. కానీ, ఆ ఫోటోలో ‘Howdy Modi’ పోస్టర్లు ఉండవు మరియు ఫోటోలో ఒక బిల్డింగ్ మీద ‘2018’ అని ఒక లైట్ బోర్డు ఉంటుంది. 2019 లో ‘Howdy Modi’ ఈవెంట్ జరిగింది. కావున, పోస్ట్ లోని ఫోటో ఫోటోషాప్ చేయబడింది.

అంతేకాదు, సెర్చ్ రిజల్ట్స్ లో ‘PhotoFunia’ వెబ్ సైట్ లింక్ కూడా వస్తుంది. ‘PhotoFunia’ అనేది ఫోటో ఎఫెక్ట్స్ వెబ్ సైట్. ఆ వెబ్ సైట్ లో ‘New York at Night’ అనే ఎఫెక్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే, మన ఇష్టం వచ్చిన ఫోటోలు టైమ్స్ స్క్వేర్ లో ఉన్నట్టు పెట్టి ఫోటో చేయొచ్చు. అలానే, పోస్ట్ లోని ఫోటో కూడా చేసి ఉండవచ్చు.

చివరగా, ఒరిజినల్ ఫోటోలో ‘Howdy Modi’ పోస్టర్లు లేవు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఒరిజినల్ ఫోటోలో ‘Howdy Modi’ పోస్టర్లు లేవు. అది ఒక ఎడిటెడ్ ఫోటో - Fact Checking Tools | Factbase.us