“రీడర్షిప్ లో అగ్రస్థానాన్ని కోల్పోయిన ‘ఈనాడు’, తెలుగు ప్రజల పత్రిక రీడర్షిప్ లో దూసుకుపోయిన ‘సాక్షి’” అంటూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : రీడర్షిప్ లో అగ్రస్థానాన్ని కోల్పోయిన ‘ఈనాడు’.
ఫాక్ట్ (నిజం): ‘ఈనాడు’ వార్తాపత్రిక రీడర్షిప్ లో అగ్రస్థానాన్ని కోల్పోయినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. అంతేకాదు, ‘Media Research Users Council’ సంస్థ వారు తాజాగా రిలీజ్ చేసిన ‘ఇండియన్ రీడర్షిప్ సర్వే Q2 -2019’ లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’ నే అగ్రస్థానంలో ఉన్నట్టు చూడవచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘రీడర్ షిప్ లో అగ్ర స్థానాన్ని కోల్పోయిన ఈనాడు’ అని వెతకగా, అటువంటి వార్త ఏదీ కూడా సెర్చ్ రిజల్ట్స్ లో రాలేదు.
వార్తపత్రికల ‘సర్క్యులేషన్’ మరియు ‘రీడర్షిప్’ ఒకటి కాదు. ‘సర్క్యులేషన్’ అంటే ‘ఒక నిర్దిష్ట ప్రచురణ యొక్క ఎన్ని కాపీలు పంపిణీ చేయబడుతుందో లెక్కించడం’. ‘రీడర్షిప్’ అంటే ‘ఒక ప్రచురణని ఎంతమంది పాఠకులు చదువుతారో అంచనా వేయడం’. ‘రీడర్షిప్’ ఆధారంగా ఆగష్టు లో ‘Media Research Users Council’ సంస్థ వారు రిలీజ్ చేసిన ‘ఇండియన్ రీడర్షిప్ సర్వే Q2 -2019’ లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’ నే అగ్రస్థానంలో ఉన్నట్టు చూడవచ్చు.
‘సర్క్యులేషన్’ ఆధారంగా ‘Audit Bureau of Circulations’ వారు 2018 సంవత్సరానికి రిలీజ్ చేసిన రిపోర్ట్ లో కూడా తెలుగు భాషలో ‘ఈనాడు’ నే అగ్రస్థానంలో ఉన్నట్టు చూడవచ్చు.
చివరగా, రీడర్షిప్ లో అగ్రస్థానాన్ని ‘ఈనాడు’ కోల్పోలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: రీడర్షిప్ లో అగ్రస్థానాన్ని ‘ఈనాడు’ కోల్పోలేదు - Fact Checking Tools | Factbase.us