Fake News, Telugu
 

హాలీవుడ్ నటి ఉర్సుల ఆండ్రెస్ ఫోటోని సోనియా గాంధీ బికినీ ధరించిన ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ బికినీ ధరించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ బికినీ ధరించినప్పుడు తీసిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో బికినీ ధరించి కనిపిస్తున్నది హాలీవుడ్ నటి ఉర్సుల ఆండ్రెస్, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కాదు. Dr. No (1962) సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ తెర్రేన్స్ యంగ్, ఉర్సుల ఆండ్రెస్ తో ఒక సీన్ గురించి చర్చిస్తునప్పుడు ఈ ఫోటో తీసినట్టు తెలిసింది. ఈ ఫోటోకి సోనియా గాంధీకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో Flickr ఇమేజ్ షేరింగ్ వెబ్సైటులో దొరికింది. జేమ్స్ బాండ్ చిత్రాలలోని మొదటి చిత్రం Dr. No (1962) షూటింగ్ సమయంలో తెర వెనుక తీసిన ఫోటో ఇదని వెబ్సైటులో తెలిపారు.  Dr. No (1962) డైరెక్టర్ తెర్రేన్స్ యంగ్, హీరొయిన్ ఉర్సుల ఆండ్రెస్ మరియు హీరో సియాన్ కానరీతో స్క్రిప్ట్ గురించి చర్చిస్తున్న ద్రుశ్యమని తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా ఆ ఫోటో గురించి మరిన్ని ఆధారాల కోసం వెతకగా, ఈ ఫోటోని షేర్ చేస్తూ పబ్లిష్ చేసిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. Dr. No (1962) చిత్ర నిర్మాణంలో భాగంగా హీరొయిన్ ఉర్సుల ఆండ్రెస్, డైరెక్టర్ తెర్రేన్స్ యంగ్ తో ఒక సీన్ గురించి చర్చిస్తున్న ద్రుశ్యమని ఈ ఆర్టికల్స్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో బికినీ ధరించి కనిపిస్తున్నది హాలీవుడ్ హీరొయిన్ ఉర్సుల ఆండ్రెస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, హాలీవుడ్ హీరొయిన్ ఉర్సుల ఆండ్రెస్ ఫోటోని చూపిస్తూ సోనియా గాంధీ బికినీ ధరించి దిగిన ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll