Fake News, Telugu
 

‘నేను ఉన్నది ఆవుల్ని రక్షించడానికి, ఆడపిల్లలను కాదు’, అని యోగీ ఆదిత్యనాథ్ అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు

0

‘నేను ఉన్నది ఆవుల్ని రక్షించడానికి, ఆడపిల్లలను కాదు’, అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నట్టు చెప్తూ, ఒక వార్తాపత్రిక ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘నేను ఉన్నది ఆవుల్ని రక్షించడానికి, ఆడపిల్లలను కాదు’, అని అన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.

ఫాక్ట్: పోస్ట్ లోని వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేసినట్టు ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేవు. వ్యంగ్యపు వార్తలు ప్రచురించే ‘RHumour times’ అనే వెబ్ సైట్ మాత్రం ఏప్రిల్ 2018లో అలాంటి వార్తనే తమ వెబ్సైటులో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వార్తను కూడా ఇప్పుడు ఆ వెబ్సైటు వారు తీసేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం దొరకలేదు. ఒకవేళ నిజంగానే యోగీ ఆదిత్యనాథ్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే అన్నీ ప్రముఖ వార్తాసంస్థలు దాని గురించి ప్రచురించేవి, కానీ ఎక్కడా కూడా అలాంటి వార్త రిపోర్ట్ కాలేదు.

పోస్ట్ లోని వార్తాపత్రిక ఫోటో ఎక్కడిదో కచ్చితమైన సమాచారం లభించలేదు. ‘RHumour times’ అనే వెబ్ సైట్ మాత్రం ఏప్రిల్ 2018 లో అలాంటి వార్తనే తమ వెబ్సైటులో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వార్తను ను ఇప్పుడు తీసేసారు; దాని ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

తాము వ్యంగ్యంగా మరియు హాస్యాస్పదంగా ఆర్టికల్స్ రాస్తామని, తమ వెబ్సైటులో ఉన్నవి నిజమైన వార్తలు కావని ‘RHumour times’ వారు తమ వెబ్సైటులో రాసినట్టు చూడవొచ్చు.

అంతేకాదు, పోస్ట్ లోని వార్తాపత్రిక ఫోటో 2018 లో వైరల్ అయినప్పుడు, ఆ వార్తలో నిజం లేదని అప్పుడే కొన్ని వార్తా సంస్థలు రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘నేను ఉన్నది ఆవుల్ని రక్షించడానికి, ఆడపిల్లలను కాదు’ అని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll