Fake News, Telugu
 

వీడియోలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది వక్ఫ్‌కు సంబంధించిన ఆస్తుల గురించి, రాష్ట్రంలోని అన్నీ ఖాళీ ప్రదేశాల గురించి కాదు

0

రాష్ట్రంలోని అన్నీ ఖాళీ ప్రదేశాలను 100% వక్ఫ్‌ బోర్డుకు స్వాధీనం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టు చెప్తూ ఒక వీడియోతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాష్ట్రంలోని అన్నీ ఖాళీ ప్రదేశాలను 100% వక్ఫ్‌ బోర్డుకు స్వాధీనం చేస్తామని చెప్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

ఫాక్ట్: వీడియోలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది వక్ఫ్‌ ఆస్తుల గురించి, రాష్ట్రంలోని అన్నీ ఖాళీ ప్రదేశాల గురించి కాదు. దర్గా హుస్సేన్ షా వలీకి సంబంధించిన భూమి కేసు గురించి మాట్లాడుతూ కంపెనీలకు మరియు తదితరులకు ఇవ్వకుండా ఉన్న ఖాళీ స్థలం వక్ఫ్‌ బోర్డుకు స్వాధీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాగే, రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో వక్ఫ్‌ భూములకు సంబంధించి ఖాళీగా ఉన్న మరియు చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూములను స్వాధీనం చేస్తామని తెలిపారు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్‌లోని వీడియో గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆ వీడియో జనవరి 2017లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిందని తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియో చూడగా, తను మాట్లాడింది వక్ఫ్‌ భూముల గురించని తెలిసింది. దర్గా హుస్సేన్ షా వలీకి సంబంధించిన భూమి కేసు గురించి మాట్లాడుతూ కంపెనీలకు మరియు తదితరులకు ఇవ్వకుండా ఉన్న ఖాళీ స్థలం వక్ఫ్‌ బోర్డుకు స్వాధీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

అలాగే, రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో వక్ఫ్‌ భూములకు సంబంధించి ఖాళీగా ఉన్న మరియు చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూములను స్వాధీనం చేస్తామని తెలిపారు. ఇదే విషయం 2017లో  ‘డెక్కన్ క్రానికల్’ వారు రాసిన అర్టికల్‌లో కూడా చదవచ్చు. 18 జనవరి 2017న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఇతర సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ చదవచ్చు. 

దర్గా హుస్సేన్ షా వలీకి సంబంధించిన భూమి కేసు తాజగా 2022లో తెలంగాణ ప్రభుత్వం గెలిచింది. ఆ భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదవచ్చు.

చివరగా, వీడియోలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది వక్ఫ్‌కు సంబంధించిన ఆస్తుల గురించి, రాష్ట్రంలోని అన్నీ ఖాళీ ప్రదేశాల గురించి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll