Fake News, Telugu
 

హిందూ వివాహాలను చట్టబద్ధం చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం 2017 లో చట్టాన్ని చేసింది

0

‘పాకిస్థాన్ లో హిందూ వివాహం చట్టబద్ధం కాదు’ అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అదే విషయం సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా చెప్పినట్టు పోస్ట్ లో ఉంటుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్థాన్ లో హిందూ వివాహం చట్టబద్ధం కాదు.

ఫాక్ట్ (నిజం): హిందూ వివాహాలను చట్టబద్ధం చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం 2017 లో చట్టాన్ని చేసింది. కావున పోస్ట్ లో ‘ హిందూ వివాహం చట్టబద్ధం కాదు’ అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

‘Sadhguru’ ఫేస్బుక్ పేజీలో పెట్టిన వీడియో నుండి పోస్ట్ లో పెట్టిన ఫోటోని తీసుకున్నట్టు చూడవొచ్చు. అదే వీడియోని ‘Sadhguru’ యూట్యూబ్ ఛానల్ లో కూడా చూడవొచ్చు. ఆ వీడియోలో పాకిస్తాన్ లోని హిందువుల పరిస్థితుల గురించి చెప్తూ, ‘పాకిస్థాన్ లో హిందూ వివాహం చట్టబద్ధం కాదు’ అని చెప్పినట్టు చూడవొచ్చు. ఆ వీడియోని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేసాడు.

పాకిస్థాన్ లో హిందూ వివాహల చట్టబద్ధత గురించి గూగుల్ లో వెతకగా, హిందూ వివాహాలను చట్టబద్ధం చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం 2017 లో చట్టాన్ని చేసిందని చెప్తూ చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. 2017 లోనే ‘The Hindu Marriage Act 2017’ చట్టం వచ్చినట్టు ‘The Economic Times’ వారు ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. ఆ చట్టం పై మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, హిందూ వివాహాలను చట్టబద్ధం చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం 2017 లో చట్టాన్ని చేసింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll