ప్రధాని నరేంద్ర మోదీ 2020 సంవత్సరం చివరి నాటికి 10 సంచలన నిర్ణయాలు తీసుకున్నారని చెప్తూ ఫేస్బుక్ లో పెట్టిన పోస్టు ని చాలా మంది షేర్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ భారత దేశంలోని ప్రతి హిందువుకి ‘ఇంటర్నేషనల్ హిందూ అసోసియేషన్ మెంబర్ షిప్ ఐడీ కార్డ్ (International Hindu Association Membership Identification Card (IHAMIC))’ అనే ఒక కొత్త హిందూ కార్డును ప్రవేశ పెడుతున్నాడని, ఆ హిందూ కార్డ్ వలన హిందువులకు చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తూ, పోస్టులో వాటిని పేర్కొన్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘ఇంటర్నేషనల్ హిందూ అసోసియేషన్ మెంబర్ షిప్ ఐడీ కార్డ్’ అనే ఒక కొత్త కార్డును భారత దేశంలోని హిందువుల కోసం నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్నారు.
ఫాక్ట్ (నిజం): ‘ఇంటర్నేషనల్ హిందూ అసోసియేషన్ మెంబర్ షిప్ ఐడి కార్డ్’ అనే కొత్త కార్డును నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్నట్టు ఎటువంటి సమాచారం లేదు. ఒక వేల ప్రభుత్వం అటువంటి కార్డు ని ప్రవేశపెట్టడం గురించి చర్చిస్తున్నా లేదా నిర్ణయం తీసుకున్నా, అందుకు సంబంధించిన సమాచారం ఇంటర్నెట్ లో లభించేది. కానీ, అటువంటి సమాచారమేమీ కూడా లభించలేదు. కాబట్టి పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో చెప్పిన విషయం (‘International Hindu Association Membership Identification Card’) గురించి గూగుల్ లో వెతికినప్పుడు, అందుకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభించలేదు. ఫేస్బుక్ లో కీ-వర్డ్స్ తో వెతికినప్పుడు, ‘నరేంద్ర మోడీ గారు 2019 సంవత్సరం చివరి నాటికి సంచలన 10 నిర్ణయాలు తీసుకున్నారు’ అనే టైటిల్ తో అదే మెసేజ్ గత సంవత్సరం డిసెంబర్ లో కూడా చలామణీ అయినట్లుగా తెలిసింది.
ఒక వేల ప్రభుత్వం నిజంగానే అటువంటి కార్డు ని ప్రవేశపెట్టడం గురించి చర్చిస్తున్నా లేదా నిర్ణయం తీసుకున్నా, అందుకు సంబంధించిన సమాచారం ఇంటర్నెట్ లో లభించేది. కానీ, అటువంటి సమాచారమేమీ లేదు.
చివరగా, ‘ఇంటర్నేషనల్ హిందూ అసోసియేషన్ మెంబర్ షిప్ ఐడి కార్డ్’ పేరుతో భారత దేశంలోని హిందువుల కోసం ప్రభుత్వం ఒక కార్డ్ ని ప్రవేశ పెడుతున్నట్టు ఎటువంటి సమాచారం లేదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?