Fake News, Telugu
 

గూగుల్ మ్యాప్స్ LoC ని తొలగించిందా? లేదు, భారతదేశం నుండి సెర్చ్ చేసినప్పుడు మాత్రమే అలా కనిపిస్తుంది

0

‘#BreakingNews: గూగుల్ మ్యాప్స్ #LoC ని తొలగించింది… ఇదే సరైన సమయం #PoK మాది’ అని చెప్తూ, రెండు ఇండియా మ్యాప్ ఫోటోలతో ఉన్న ఫేస్బుక్ పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులోని ఫోటో-1 ‘అంతకు ముందుది’ అని మరియు ఫోటో-2 ‘లేటెస్ట్ ది’ అని చెప్తున్నారు. ఫోటో-1 లో ఇండియా మ్యాప్ లో LoC (నియంత్రణ రేఖ) ఉంటుంది, ఫోటో-2 లో LoC (నియంత్రణ రేఖ) ఉండదు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: గూగుల్ మ్యాప్స్ భారత దేశ మ్యాప్ లో LoC (నియంత్రణ రేఖ) ని తొలగించింది.

ఫాక్ట్ (నిజం): భారతదేశం నుండి మ్యాప్స్ ని చూస్తే గూగుల్ మ్యాప్స్ LoC (నియంత్రణ రేఖ) ని చూపించదు, కానీ ఇతర దేశాల నుండి మ్యాప్స్ ని చూస్తే ఇప్పటికీ నియంత్రణ రేఖను చూపుతుంది. ఎక్కడనుండి సెర్చ్ చేస్తున్నారనే దాని ఆధారంగా, గూగుల్ మ్యాప్స్ వివాదాస్పద భూభాగాలను తదనుగుణంగా చూపిస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్టులోని విషయంతోనే ఉన్న మరొక ఫేస్బుక్ పోస్టు లభించింది. ఆ పోస్టులోని కామెంట్స్ లో చాలా మంది ఇతర దేశాల నుండి గూగుల్ మ్యాప్స్ లో భారత దేశ మ్యాప్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ లను పెట్టారు. వాటిల్లో LoC ని చూడవచ్చు.

అమెరికాలో గూగుల్ మ్యాప్స్ చూస్తే భారత దేశ మ్యాప్ ఎలా కనపడుతుందో చూపెట్టే ఫోటో FACTLY కి కూడా వచ్చింది. అందులో LoC ఉంది. గూగుల్ మ్యాప్స్ వెబ్సైటు లో,‘వివాదాస్పద సరిహద్దులు గ్రే కలర్ డాష్ లతో చూపించాబడతాయి, ఆ ప్రాంతాలు సరిహద్దును అంగీకరించవు’ అని ఉంది.

మీరు ఏ దేశం నుండి శోధిస్తున్నారనే విషయం ఆధారంగా గూగుల్ మ్యాప్స్ వివాదాస్పద సరిహద్దులను మారుస్తుందిఅని Washington Post’ కథనం లో కూడా చదవొచ్చు. ఆ కథనం ఫిబ్రవరి 2020 లో ప్రచురించబడింది మరియు అందులో ఆ సంస్థ వివిధ దేశాల నుండి జమ్మూ& కాశ్మీర్ మ్యాప్ ని చూసినప్పుడు, అందులోని తేడాలను పేర్కొంది. కాబట్టి, భారతదేశం నుండి చూసినప్పుడు గూగుల్ మ్యాప్స్ లో LoC ని తొలగించడం అనేది బ్రేకింగ్ న్యూస్ (పోస్ట్‌లో పేర్కొన్నట్లు) ఏమీ కాదు. గూగుల్ మ్యాప్స్‌లో ప్రపంచంలోని వివిధ వివాదాస్పద భూభాగాలు ఎలా చూపించబడుతున్నాయో వివరించిన ‘Washington Post’ వారి వీడియో ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఇతర దేశాల నుండి చూసినప్పుడు గూగుల్ మ్యాప్స్‌లో భారతీయ మ్యాప్‌లో LoC ని ఇప్పటికీ చూడవచ్చు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll