ఒక విమానం రన్‌వే నుండి నిలువుగా (వర్టికల్) టేకాఫ్ అయిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇది భారతదేశ యుద్ధ విమానం తేజస్‌ను (ఇక్కడ, మరియు ఇక్కడ) చూపుతున్నదని వాదనలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా వీడియోలో నిజమెంతో తెలుసుకుందాం.

క్లెయిమ్: భారతదేశ యుద్ధ విమానం తేజస్ నిలువుగా (వర్టికల్) టేకాఫ్ ని చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో అసలు నిజమైనది కాదు, ఇంకా తేజస్ విమానాన్ని చూపించడం లేదు. ఇది ఒక గేమ్ సిములేషన్ వీడియో. ఈ వీడియో ‘BAUS’ పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీలో అప్‌లోడ్ చేయబడింది. ఈ పేజీ గేమింగ్ వీడియోల క్రియేటర్”గా గుర్తించబడింది, ఎయిర్‌క్రాఫ్ట్ సిమ్యులేషన్ గేమ్ క్లిప్‌లను తరచూ షేర్ చేస్తుంటుంది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ద్వారా తయారు చేయబడుతుంది. దీన్ని LCA తేజస్ (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) అని కూడా అంటారు. HAL వెబ్‌సైట్‌లో చెప్పిన ప్రకారం, తేజస్‌కు నిలువు (వర్టికల్) టేకాఫ్ మరియు ల్యాండింగ్ (VTOL) సామర్థ్యం లేదు. దీని డిజైన్ సాధారణ యుద్ధ విమానాల ప్రకారం ఉంటుంది, అందువల్ల టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం రన్‌వే అవసరం. VTOL సామర్థ్యం ఉన్న విమానాలకు సంబంధించిన సమాచారాన్ని (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చూడవచ్చు.

వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు మాకు పూర్తి నిడివి గల అదే వీడియో లభించింది. ఈ వీడియో “BAUS” Facebook ఛానెల్‌లో 26 ఆగస్టు 2024న “AV-8B హారియర్ ఫైటర్ జెట్ యొక్క సూపర్ రేర్ వర్టికల్ టేకాఫ్” అనే శీర్షికతో అప్‌లోడ్ చేయబడింది (ఆర్కైవ్ లింక్). అలాగే, అదే వీడియో 21 ఆగస్టు 2024న ‘BAUS’ YouTube ఛానెల్‌లో కూడా అప్‌లోడ్ చేయబడింది (ఆర్కైవ్ లింక్). వీడియో వివరణలోచెప్పిన దాని ప్రకారం: “ఇది గేమ్ సిమ్యులేటర్ వీడియో, నిజమైన సంఘటన కాదు. దయచేసి ఈ క్షణం ఆనందించండి.” దీని గురుంచి మరింత వెతుకుతున్నప్పుడు, AV-8B హారియర్ విమానం నిలువు టేకాఫ్ మరియు ల్యాండింగ్ (VTOL) సామర్థ్యాన్ని కలిగి ఉందని మాకు తెలిసింది.

ఒకపోతే BAUS పేజీ “గేమింగ్ వీడియో క్రియేటర్”గా గుర్తించబడింది. ఛానెల్ యొక్క ‘ఎబౌట్’ విభాగంలో “అన్ని వీడియోలు కేవలం వినోదం కోసం మాత్రమే సిమ్యులేటర్ గేమ్‌ల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇవి నిజమైనవి కావు” అని పేర్కొన్నది . ఈ ఫేస్‌బుక్ పేజీలో ఇలాంటి అనేక వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) అప్లోడ్ చేసారు.

ఇంతకు ముందు, ఇలాంటి సిమ్యులేషన్ గేమింగ్ వీడియోలు ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క నిజమైన విజువల్స్‌గా షేర్ చేయబడినప్పుడు, ఆ వీడియోల గురుంచి ఫాక్ట్-చెక్ కథనాలను Factly ప్రచురించింది. ఆ కథనాలను ఇక్కడ , ఇక్కడ , మరియు ఇక్కడ చూడవచ్చు .
చివరిగా, ఒక గేమ్ సిములేషన్ వీడియోను భారతదేశ యుద్ధ విమానం తేజస్ నిజమైన విజువల్స్‌గా షేర్ చేస్తున్నారు