జేమ్స్, కేరి అనే ఇద్దరు రైతులు ఫ్రూట్ సలాడ్ అనే ఒక చెట్టుని డెవలప్ చేసారంటూ ఒకే చెట్టుకి ఏడు వేర్వేరు రకాల పండ్లు కాసిన ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఏడు వేర్వేరు రకాల పండ్లు కాసే ఫ్రూట్ సలాడ్ చెట్టు ఫోటో.
ఫాక్ట్ (నిజం): సాధారణంగా గ్రాఫ్టింగ్ పద్దతి ద్వారా ఒకే చెట్టుకి వివిధ రకాల పండ్లను పండించొచ్చు. కాకపోతే ఒక చెట్టుకి ఒకే ఫ్యామిలీకి చెందిన పండ్లను మాత్రమే పండించొచ్చు. ఇలా పండించిన చెట్లని ఫ్రూట్ సలాడ్ ట్రీస్ అని అంటారు. ఐతే ఒకే చెట్టుకి వేర్వేరు ఫ్యామిలీలకు చెందిన పండ్లను మాత్రము పండించలేము. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
సాధారణంగా గ్రాఫ్టింగ్ పద్దతి ద్వారా ఒకే చెట్టుకి వివిధ రకాల పండ్లను పండించొచ్చు, ఐతే ఈ విధానంలో కేవలం ఒకే ఫ్యామిలీకి చెందిన వివిధ రకాల పండ్లను మాత్రమే గ్రాఫ్టింగ్ ద్వారా పండించొచ్చు. వీటిని ఫ్రూట్ సలాడ్ ట్రీస్ అని అంటారు. ఇలా ఒకే చెట్టుకి వేర్వేరు పండ్లను పండించినప్పుడు ఆ వేర్వేరు పండ్లు తమ సొంత లక్షణాలను (రుచి, రూపం, మొదలైనవి) కలిగి ఉంటాయి. ఉదాహారణకి సిట్రస్ ఫ్యామిలీ కి చెందిన నిమ్మకాయలు, నారింజ, టాంజెలోస్, ద్రాక్షపండు మొదలైనవి ఒకే చెట్టుకి పండించొచ్చు. అలాగే ఒకే చెట్టుకి వివిధ రకాల ఆపిల్స్‌ని పండించొచ్చు.
అంతేగాని ఒకే చెట్టుకి వివిధ ఫ్యామిలీలకి చెందిన పండ్లను పండించలేము. పోస్టులోని ఫోటోలో ఉన్నట్టు ఒకే చెట్టుకి ఆపిల్, నారింజ, అరటి, మొదలైన వివిధ రకాల పండ్లను పండించలేము. దీన్నిబట్టి పోస్టులో ఒకే చెట్టుకి అరటి, ఆపిల్, నారింజ మొదలైన పండ్లు కాసిన ఫోటో నిజం కాదని అర్ధమవుతుంది.
చివరగా, ఒక చెట్టుకి ఒకే ఫ్యామిలీకి చెందిన వివిధ పండ్ల రకాలను పండించొచ్చు గాని ఒకే చెట్టుకి వేర్వేరు ఫ్యామిలీలకు చెందిన పండ్లను పండించలేము.