Fake News, Telugu
 

దేశంలోని ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల మన్మోహన్ సింగ్ ని కలుసుకోలేదు

0

దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని కలుసుకొని సలహాలు అడిగినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దేశంలోని ఆర్ధిక ఇబ్బందుల పరిస్థితులకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని కలిసి సూచనలు అడిగారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో జూన్ 2019లో తీసింది. 2019లో ఆర్ధిక మంత్రిగా తొలిసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న సందర్భంలో నిర్మలా సితారామన్ మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ని ఇలా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశంలోని ఆర్ధిక ఇబ్బందులకు సంబంధించి సితారామన్ ఇటీవల మన్మోహన్ సింగ్ ని కలుసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం కీ పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతికితే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని ఆర్ధిక ఇబ్బందులకు సంబంధించి ఇటీవల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని కలుసుకోలేదని తెలిసింది. పోస్టులో తెలుపుతున్న విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఎటువంటి న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అవలేదు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దృశ్యం కలిగిన వీడియోని షేర్ చేస్తూ ‘NDTV’ న్యూస్ వెబ్సైటు 27 జూన్ 2019 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆర్ధిక మంత్రిగా తొలిసారి పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న సందర్బంలో, నిర్మలా సితారామన్ మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. ఇదే విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ మరికొన్ని న్యూస్ వెబ్సైట్లు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, 2014లో తీసిన వీడియోని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ జీడీపీ (GDP) వృద్ధి కోసం మన్మోహన్ సింగ్ ని సూచనలు అడుగుతున్న వీడియోగా షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు.

చివరగా, దేశంలోని ప్రస్తుత ఆర్ధిక పరిస్థుతులకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఇటివల మన్మోహన్ సింగ్ ని కలుసుకోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll