Fake News, Telugu
 

ఈజిప్ట్ కిడ్నాపర్ ఫోటో పెట్టి జామియా మిలియా స్టూడెంట్ అని ప్రచారం చేస్తున్నారు

2

ఫేస్బుక్ లో కొన్ని ఫోటో లని పోస్టు చేసి, ‘జామియా మిల్లియా నిరసనకారురాలు రాళ్లు విసురుతుండగా పట్టుకున్నారు.. తనిఖీ చేసి చుస్తే ఆమే ఆమే కాదు…వాడు..!’ అని వాటి గురించి చెప్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జామియా మిలియా విశ్వవిద్యాలయంలో చేపట్టిన నిరసనల్లో పోలీసులకు పట్టుబడ్డ ఆడ వేషంలో ఉన్న మగ విద్యార్థివి.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఆడ వేషంలో ఉన్న మగతని ఫోటో కైరో (ఈజిప్ట్) లో పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అతన్ని కొంతమంది వ్యక్తులు పట్టుకుని పోలీసులకి అప్పగించినప్పటిది. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.

పోస్టులో మొదటి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది  కైరో (ఈజిప్ట్) లో ఒక మగతను ఆడ వేషం వేసుకుని పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అతన్ని పట్టుకుని పోలీసులకి అప్పగించినప్పటిదని ‘Kayan News’ వారి ఆగష్టు 2017 కథనం ద్వారా తెలుస్తుంది. అదే ఫోటోని ఈజిప్ట్ కి చెందిన ‘Youm7’ అనే వార్తా సంస్థ ఆ ఘటనపై చేసిన ట్వీట్ లో కూడా చూడవచ్చు. పోస్టులో ఉన్న రెండవ మరియు మూడవ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అవి జామియా మిలియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన నిరసనల సందర్భంలో పోలీసులు కొంతమంది మహిళలను ఆధీనంలోకి తీసుకున్నప్పటివని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కావున, పోస్టులో ఉన్న మొదటి ఫోటోకి మరియు ఇతర ఫొటోలకి ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, కైరో (ఈజిప్ట్) లో పిల్లల్ని కిడ్నప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పట్టుబడ్డ వ్యక్తి ఫోటో ని తప్పుడు ఆరోపణతో షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll