Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని, కోతి ఆహార పదార్ధాలతో రాముడి పేరు లిఖిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

కోతి తన ఆహార పదార్ధాలతో తెల్ల కాగితంపై రాముడి పేరుని (హిందీ అక్షరాలలో राम) లిఖిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: కోతి తన ఆహార పదార్ధాలతో రాముడి పేరుని రాస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోని రివెర్స్ ఎడిట్ చేసి రూపొందించారు. ఒరిజినల్ వీడియోలో కోతులు, తెల్ల కాగితంపై ముందుగానే ‘राम’ అక్షరంతో అమర్చి ఉన్న ఆహార పదార్ధాలను తింటున్నాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోలో కోతులు తమ నోటి నుండి పదార్ధాలను తీసి రాముడి పేరుని రాస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, కోతులు రాముడి పేరును రాయడంలేదని, తెల్ల కాగితంపై ముందుగానే ‘राम’ అక్షరంతో అమర్చి ఉన్న ఆహార పదార్ధాలని తింటున్నాయని గుర్తించవచ్చు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని సచిన్ బుధ్వర్ అనే వ్యక్తి 04 జనవరి 2022 నాడు తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసినట్టు తెలిసింది. కాగితంపై ముందుగానే అక్షరాలు రాసి వీడియోని రివర్స్ ఎడిట్ చేసి అధ్బుతంగా రూపొందించారని ఒక యూసర్ కామెంట్ చేయగా, సచిన్ బుధ్వర్ ఆ యూసర్ చెప్పిన విషయాన్నీ అంగీకరిస్తూ అతనికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ వీడియోని రివర్స్ ఎడిట్ చేసిన ప్రక్రియని కింద చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని కోతి ఆహార పదార్ధాలతో రాముడి పేరు లిఖిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll