ఇజ్రాయెల్ కొరోనావైరస్ నివారణకు ఔషధం కనుక్కుందని, అందుకే ఆ దేశంలో ఏ కొరోనావైరస్ మరణాలు రిపోర్ట్ కాలేదని క్లెయిమ్ చేస్తూ ఒక మెసేజ్ సోషల్ మీడియా లో ప్రచారం కాబడుతుంది. ఆ మెసేజ్ లోని క్లెయిమ్ ప్రకారం, వేడి నీటిలో నిమ్మకాయ మరియు బేకింగ్ సోడా ని కలిపి టీ లాగా తాగితే కొరోనావైరస్ ను నివారించవచ్చని ఉంది. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.

క్లెయిమ్: ఇజ్రాయెల్ నిమ్మకాయ మరియు బేకింగ్ సోడా ఉన్న మిశ్రమాన్ని కొరోనావైరస్ నివారణకు కనుక్కోవడంతో ఆ దేశం లో కొరోనావైరస్ (COVID-19) మరణాలు సంభవించలేదు.
ఫాక్ట్ (నిజం): ఇజ్రాయెల్ 20 ఏప్రిల్ 2020న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొరోనావైరస్ వలన వల్ల దేశంలో 171 మరణాలు రిపోర్ట్ అయ్యాయి. అంతేకాక, నిమ్మకాయ మరియు బేకింగ్ సోడా మిశ్రమం కొరోనావైరస్ ని నివారిస్తుంది అన్నదానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఇప్పటివరకు కొరోనావైరస్ ని నివారించడానికి కానీ నయం చేయడానికి కానీ ఏ ఔషధం లేదు. కావున, ఆ క్లెయిమ్ అబద్ధం.
WHO వారి వెబ్సైట్ లో కొరోనావైరస్ మీద ప్రతీ దేశం యొక్క స్టేటస్ ని చూడవచ్చు. 20 ఏప్రిల్ 2020 సిట్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం ఇజ్రాయెల్ లో 171 మరణాలు రిపోర్ట్ అయ్యాయి అని తెలుస్తుంది. ఇజ్రాయెల్ లో 20 మార్చ్ 2020న COVID-19 వల్ల మొదటి మరణం సంభవించినట్టు రిపోర్ట్ అయింది. కావున, ఇజ్రాయెల్ లో కొరోనావైరస్ వలన ఏ మరణాలు సంభవించలేదు అన్న దాంట్లో నిజం లేదు.

COVID-19 నివారణకు ఎటువంటి మందులు లేవని, చాలా వరకు క్లినికల్ ట్రయల్ స్టేజి లో ఉన్నాయని WHO వెబ్సైటు లో చూడొచ్చు.

ఇంతకముందు కూడా ఇలానే ఆల్కలైన్ ఆహార పధార్ధాలతో కొరోనావైరస్ ని నివారించవచ్చు అనే పోస్ట్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంటే ఆ సమాచారం తప్పు అని ‘FACTLY’ రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, COVID-19 వల్ల ఇజ్రాయెల్ లో సంభవించిన మరణాలను ఆ దేశం రిపోర్ట్ చేసింది. అంతేకాక, నిమ్మకాయ మరియు బేకింగ్ సోడా మిశ్రమంతో కొరోనావైరస్ (SARS-COV-2) ని చంపలేము.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?