Fake News, Telugu
 

వీడియోలో ఉన్నది ‘Alligator Snapping Turtle’. అది మనిషిలాగా అరవదు.

0

‘ప్రజలు స్మశానవాటిక సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి అరుస్తున్నట్లు అనిపిస్తుంది …కానీ అది కబెర్బిజ్జు యొక్క ఈ గొంతు…’ అంటూ ఒక జంతువు అరుస్తున్న వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియోలో ఒక మనిషిలాగా అరుస్తున్న ‘కబెర్బిజు’ అనే జంతువు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్న జంతువు పేరు ‘Alligator Snapping Turtle’. అది మనిషిలాగా అరవదు. వీడియోని ఎడిట్ చేసి మనిషి అరిచే వాయిస్ ని జోడించారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

జంతువుని చూస్తే తాబేలులా ఉన్నా వీడియోలోని వ్యక్తి మాటలను సరిగ్గా వింటే, అది ఒక ‘Alligator’ అని తను చెప్తాడు. దాని ఆధారంగా గూగుల్ లో ఆ జంతువు ఫోటోతో వెతకగా, వీడియోలో ఉన్నది ‘Alligator Snapping Turtle’ అని తెలుస్తుంది.

వీడియోలో చూపెట్టినట్టు ‘Alligator Snapping Turtle’ మనిషిలాగా అరుస్తుందని ఎక్కడా కూడా సమాచారం లేదు. వైల్డ్ లైఫ్ కి సంబంధించిన ఒక వీడియోలో ‘Alligator Snapping Turtle’ ని ఒక వ్యక్తి పట్టుకుంటాడు, కానీ అది వీడియోలో చూపెట్టినట్టు మనిషిలాగా అరవదు, గట్టిగా కూడా అసలు అరవదు. ‘Alligator Snapping Turtle’ పై మరింత సమాచారం కొరకు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

పోస్ట్ చేసిన వీడియో లో కింద ‘Tik Tok – @mdanford1105’ అని ఉంటుంది. దాని ఆధారంగా ‘Tik Tok’ లో వెతకగా, అదే వీడియోని పెట్టి ఒకతను వివరణ లో ‘Scream, Man- Authentic Sound Effects’ అని రాసాడు. ‘Scream, Man- Authentic Sound Effects’ అనేది ఒక సౌండ్ ఎఫెక్ట్ అని, దానీ ఆధారంగా చాలా మంది ‘Tik Tok’ లో చాలా వీడియోలు పెట్టినట్టు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, వీడియో లో ఉన్నది ‘Alligator Snapping Turtle’. అది మనిషిలాగా అరవదు. వీడియో ఎడిట్ చేయబడింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll